క్రీడాభూమి

ఉత్తమంగా రాణించాలనుకుంటున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: టీమిండియాలో ఉత్తమ ఆటగాడిగా రాణించాలని అభిలషిస్తున్నానని యువ సంచలనం 18 ఏళ్ల పృథ్వీ షా అన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకోవడంతో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’కు ఎంపికైన ఈ యువ సంచలనం అద్భుత ఆటగాడిగా ఎంతోమంది క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆరంగేట్రం చేసిన రెండు టెస్టుల్లోనే 118.50 సరాసరిన 236 పరుగులు చేశాడు. ఈ టెస్టుల్లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 134. టెస్టుల్లో చోటుదక్కించుకున్న వెంటనే త్వరితగతిన సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా, ఈ ఘనత సాధించిన ఏడో భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. బ్యాటింగ్ ఝళిపించడంలో రాటుదేలిన దిగ్గజాల్లో సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్ వంటివారితో పోల్చదగ్గ ఆటగాడిగా పలువురు నుంచి ప్రశంసలు అందుకున్నాడు. టెస్టు క్రికెట్ రంగంలోకి ఆరంగేట్రం చేసిన వెంటనే సాధించిన ఘనతతోనే సంతృప్తి చెందడం లేదని, భవిష్యత్తులో ఉత్తమ ఆటగాడిగా రాణించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ట్విటర్ వేదికగా పృథ్వీ షా పేర్కొన్నాడు. టీమిండియా ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ సైతం పృథ్వీ ఆటతీరును మనసారా మెచ్చుకున్నాడు. చిన్నప్పటినుంచే క్రికెట్‌లో రాటుదేలిన పృథ్వీ గట్టి పోరాటపటిమగల వ్యక్తి అని రవిశాస్ర్తీ ప్రశంసించాడు. ముంబయిలోని థానేలో జన్మించిన ఈ టీనేజర్ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల ద్వారా 1655 పరుగులు సాధించాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 61.29 సరాసరిన 188. కాగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి 465 పాయింట్లతో 60వ ర్యాంక్‌లో నిలిచాడు.