క్రీడాభూమి

సైనా ముందుకు.. సింధుకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెనె్స (డెన్మార్క్): ఇక్కడ మంగళవారం ప్రారంభమైన డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత షట్లర్, మూడో సీడ్ పీవీ సింధు నిరాశపరిచింది. అయితే, మరో మ్యాచ్‌లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ ముందుకు సాగింది. తొలిరౌండ్‌లో పోటీపడిన సైనా హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గాన్ యి ఛెంగ్‌ను 20-22, 21-17, 24-22 తేడాతో ఓడించింది. 81 నిమిషాల పాటు జరిగిన ఈ పోటీలో గెలుపుతో సైనా రెండో రౌండ్‌కు చేరుకుంది. కాగా, తొలి రౌండ్‌లో పోటీపడిన సింధు ప్రత్యర్థి అమెరికాకు చెందిన బీవెన్ ఝాంగ్ చేతిలో 17-21, 21-16, 18-21 తేడాతో ఓడిపోయింది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ తొలిరౌండ్‌లో మొదటినుంచి ప్రత్యర్థి సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. ఇదే ప్రత్యర్థి చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరసగా మూడోసారి. ఆమెరికా షట్లర్ బీవెన్ ఝాంగ్ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో సింధును ఓడించింది.
చిత్రం..సైనా నెహ్వాల్