క్రీడాభూమి

ఆసీస్ టూర్‌లో సవాళ్లు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: ఆస్ట్రేలియా టూర్‌లో తమకు సవాళ్లు తప్పవని భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. సోమవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఆసీస్ బరిలోకి దిగుతున్నప్పటికీ, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా వాతావరణానికి, పిచ్ తీరుకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మెరుగైన ప్రదర్శనతో రాణించే అవకాశం ఉంటుందన్నాడు. దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంఘటనలో వార్నర్, స్మిత్ నిషేధాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వారిద్దరూ జట్టులో కీలక ఆటగాళ్లని, అయితే, వారు లేకపోయినప్పటికీ, ఆస్ట్రేలియా బలంగానే ఉందని భువీ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించడం చాలా కష్టమని చెప్పాడు. అయితే, ఆసీస్ నుంచి ఎదురయ్యే ప్రతి సవాలునూ ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నాడు. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడం శుభసూచకమని అన్నాడు. మొదటి టెస్టు డిసెంబర్ 6న అడెలైడ్‌లో మొదలవుతుంది.

వనే్డ జట్టుకు లూయిస్ దూరం
గౌహతి, అక్టోబర్ 17: భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. అయితే, అతను జట్టును వీడి వెళ్లడానికి ఇతరత్రా కారణాలు ఉన్నాయని అంటున్నారు. క్రికెట్ వెస్టిండీస్ ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో లూయిస్‌కుకు చోటు దక్కలేదు. వివిధ దేశాల్లో జరిగే లీగ్‌లు, చాంపియన్‌షిప్ పోటీలకు అతనిని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే క్రికెట్ వెస్టిండీస్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. క్రిస్ గేల్ మాదిరిగానే లూయిస్‌ను విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా తయారు చేసేందుకు వివిధ టోర్నీల్లో ఆడించాలన్నది విండీస్ క్రికెట్ పెద్దల అభిప్రాయం. అయితే, సెంట్రల్ కాంట్రాక్టు లభించకపోవడంపై లూయిస్ అసంతృప్తితో ఉన్నాడని అతని సన్నిహితులు అంటున్నారు. ఈ కారణంగానే అతను భారత్ టూర్ నుంచి వైదొలగి ఉండవచ్చని చెప్తున్నారు. నిజానిజాలు ఎలావున్నా, భారత్ వంటి బలమైన జట్టుతో తలపడే విండీస్‌కు లూయిస్ లేకపోవడం పెద్ద దెబ్బగానే చెప్పాలి. టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ వేయించుకున్న ఈ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఏ విధంగా ఆడుతుందో చూడాలి.