క్రీడాభూమి

డెన్మార్క్ ఓపెన్ రెండో రౌండ్‌లో శ్రీకాంత్ ప్రత్యర్థి లిన్‌డాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓడెన్స్ (డెన్మార్క్), అక్టోబర్ 17: ఇక్కడ జరుగుతున్న డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత ఆటగాడు శ్రీకాంత్‌కు లెజండరీ ఆటగాడు, ప్రపంచ మాజీ నెంబర్ వన్ లిన్‌డాన్ ఎదురుకానున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరవ స్థానంలో ఉన్న శ్రీకాంత్ మొదటి రౌండ్‌లో సోల్‌బర్గ్ విట్టింగస్‌ను 21-16, 21-10 తేడాతో చిత్తుచేశాడు. అయితే ప్రస్తుతం 14వ ర్యాంకులో ఉన్న లిన్‌డాన్‌ను శ్రీకాంత్ ఏ విధంగా ఎదుర్కొంటాడో అన్నది ఉత్కంఠ రేపుతోంది. 2014 చైనా ఓపెన్‌లో లిన్‌డాన్‌ను ఓడించి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. అయితే ఆ తర్వాత అతనికి ఆ స్థాయిలో విజయాలు లభించలేదు. ఇలావుండగా మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప, సిక్కీరెడ్డి జోడీ రెండో రెండ్‌కు చేరుకుంది. మొదటి రౌండ్‌లో వీరు అమెరికాకు చెందిన ఏరియల్ లీ, సిడ్నీ లీ జోడీపై 21-7, 21-11 తేడాతో గెలుపొందారు.