క్రీడాభూమి

వరల్డ్‌కప్‌లో ఆడాలని ఖలీల్ తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 19: దుబాయ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న ఆసియా కప్‌లో తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఎడమచేతివాటం పేసర్ ఖలీల్ అహమ్మద్ వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్ కప్‌లో చోటు కోసం తహతహలాడుతున్నాడు. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడానని, వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే వనే్డలలో సైతం వీలైనన్ని ఎక్కువ వికెట్లు పడగొడతాననే గట్టి నమ్మకం ఉందని అన్నాడు.

హాకీ గోల్‌కీపర్ చిట్కేపై నిషేధం
ఆరుగురు అథ్లెట్లపై నాలుగేళ్ల సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: డోపింగ్ కేసులో పట్టుబడిన హాకీ గోల్‌కీపర్ ఆకాష్ చిట్కేపై రెండేళ్లు, ఆరుగురు అథ్లెట్లపై నాలుగేళ్లపాటు సస్పెన్షన్ విధించారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిట్కేను ఈ ఏడాది మార్చి 27నే ప్రాథమికంగా సస్పెండ్ చేసినట్టు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (నాడా) తెలిపింది. డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చిట్కే వాదనలు ఈనెల 8వరకు విన్న యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్ (ఏడీడీపీ) అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు శిబిరంలో పాల్గొన్న సందర్భంగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు రుజువైందని ‘నాడా’ పేర్కొంది. గోల్‌కీపర్ చిట్కేతోపాటు మరో ఆరుగురు అథ్లెట్లు (రెజ్లర్-అమిత్, కబడ్డీ-ప్రదీప్ కుమార్, వెయిట్‌లిఫ్టర్-నారాయణ్ సింగ్, అథ్లెట్‌లు సౌరభ్ సింగ్, బల్జీత్ కౌర్, సిమర్జిత్ కౌర్ నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో వారిపై నాలుగేళ్లపాటు నిషేధం విధించినట్టు ‘నాడా’ తెలిపింది.

క్వార్టర్ ఫైనల్స్‌కు కిడాంబి శ్రీకాంత్
ఒడెనె్స (డెన్మార్క్), అక్టోబర్ 19: డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు చైనాకు చెందిన లిన్ డాన్‌ను రెండో రౌండ్‌లో వరల్డ్ నెంబర్ ఆరో ఆటగాడు శ్రీకాంత్ 18-21, 21-17, 21-16 తేడాతో ఓడించాడు. లిన్ డాన్‌ను ఓడించడం శ్రీకాంత్‌కు ఇది రెండోసారి. 2014లో చైనా ఓపెన్‌లో తొలిసారిగా లిన్ డాన్‌ను శ్రీకాంత్ ఓడించాడు. లిన్ డాన్ రెండుసార్లు ఒలింపిక్ గోల్డ్‌మెడల్స్ సా ధించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. కాగా, క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ షట్లర్, ప్రపంచ 23వ ర్యాంకర్ సమీర్ వర్మతో శ్రీకాంత్ తలపడనున్నాడు.