క్రీడాభూమి

హోం గ్రౌండ్‌లో కోహ్లీకి పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 1: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోమవారం హోం గ్రౌండ్‌లోనే పరీక్ష ఎదురుకానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవడానికి బెంగళూరు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిన అవసరం ఎర్పడింది. నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్‌లు ఆడి, నాలుగు విజయాలను నమోదు చేసింది. మూడు పరాజయాలను ఎదుర్కొంది. మొత్తం ఎనిమిది పాయింట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. కాగా, ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో బెంగళూరు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం రెండు విజయాలను సాధించింది. నాలుగు పరాజయాలను ఎదుర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌ను ఢీకొని 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. నైట్ రైడర్స్ కూడా తన చివరి మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, 18.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడంలో విఫలమై, 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 179 పరుగులు చేయగలిగింది. రెండు జట్లు ఓటమి భారం నుంచి బయటపడి, మళ్లీ విజయాల బాట పట్టాలన్న పట్టుదలతో ఉన్నాయి. గౌతం గంభీర్ నాయకత్వంలోని నైట్ రైడర్స్‌కే కోహ్లీ సేనపై విజయావకాశాలు ఉన్నాయని విశే్లషకుల అభిప్రాయం.

రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్
పుణె, మే 1: డిఫెండింగ్ చాంపియన్ ముంబయ ఇండియన్స్ ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని రైజింగ్ పుణె సూపర్‌జెయంట్స్‌ను 8 వికె ట్ల తేడాతో చిత్తుచేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, ముంబయని గెలిపించాడు. 160 పరుగుల లక్ష్యాన్ని ముంబయ 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయ అందుకుంది.
టాస్ గెలిచిన ముంబయ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, రైజింగ్ పుణె తొలుత బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు సాధించింది. సౌరభ్ తివారీ 45 బంతులు ఎదుర్కొని, 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవెన్ స్మిత్ 23 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 24 పరుగులు చేసి అవు టయ్యాడు. ముంబయ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 29 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
రైజింగ్ పుణెను ఓడించడానికి 160 పరుగులు సాధించాల్సిన ముంబయ ఇండియన్స్ ఇన్నింగ్స్ ను రోహిత్‌తో కలిసి ఆరంభించిన పార్థీవ్ పటేల్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అతనిని ధోనీ క్యాచ్ పట్టగా అశోక్ దిండా పెవిలియన్‌కు పంపాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన తె లుగు వీరుడు అంబటి రాయుడు 19 బంతులు ఎదుర్కొని 22 పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో ఆజింక్య రహానే క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. అనంతరం జొస్ బట్లర్‌తో కలిసి రోహిత్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. 18.3 ఓవర్లలో ముంబయ రెండు వికెట్లకు 161 పరుగులు చేయగా రోహిత్ 85 (60 బంతులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), జొస్ బట్లర్ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

ప్రపంచ కప్ ఆర్చరీ
భారత్‌కు రజతం
షాంఘై, మే 1: ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టుకు రజత పతకం లభించింది. దీపికా కుమారి, బొంబల్య దేవి లాషమ్,్ర లక్ష్మీరాణి మాహితో కూడిన ఈ జట్టు ఫైనల్‌లో చైనీస్ తైపీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, నిలకడగా రాణించలేకపోయిన భారత మహిళలు ఓటమిని కొనితెచ్చుకున్నారు.