క్రీడాభూమి

మీ సహాయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 22: శ్రీలంక క్రికెట్‌ను ఎంతోకాలంగా వేధిస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ సమస్యతోపాటు జరుగుతున్న మో సాలపై చట్టపరంగా ముందుకు సాగేందుకు తద్వారా సహాయం కావాలని శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ భారత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సీబీఐ)ని కోరాడు. తమ దేశ క్రికెట్‌లో వేళ్లూనుకుపోయిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఈ రంగంలో నిపుణుల సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాడు. ‘మ్యాచ్ ఫిక్సింగ్ సమస్యను పరిష్కరించేందుకు, న్యాయపరంగా దీనిని అధిగమించేందుకు మా వద్ద నిపుణులు లేరు’ అని వ్యాఖ్యానించాడు. తాను చేసిన విజ్ఞప్తిపై భారత్ సూత్రపాయంగా అంగీకరించిందని న్యూఢిల్లీ నుంచి ఇక్కడకు తిరిగివచ్చిన తర్వాత అర్జున రణతుంగ పేర్కొన్నాడు. ఈ ఏడాది మేలో గాలే మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గ్రౌండ్ కీపర్ తరంగ ఇండికా, ప్రొఫెసనల్ క్రికెటర్ తరిందు మెండిస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు మీడియా సంబంధిత క్లిప్పింగ్‌లతో సహా దుమ్మెత్తిపోసింది. దీనిపై స్పందించిన శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ వారిద్దరినీ తక్షణం సస్పెండ్ చేసి, సమగ్ర దర్యాప్తు కోసం ఐసీసీకి నివేదించింది. అదేవిధంగా ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌తో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో మూడో వ్యక్తి, ప్రొవిన్సియల్ కోచ్ జీవాంత కులతుంగను సైతం సస్పెండ్ చేసింది. అదేవిధంగా 1996 వరల్డ్ కప్‌ను గెలిపించిన జట్టులో సభ్యుడైన సనత్ జయసూర్యపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ జయసూర్యతోపాటు మరికొందరి పాత్రపై దర్యాప్తు చేస్తోంది.