క్రీడాభూమి

టెస్టు ర్యాంకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 21: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్ ఆదివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో 3వ స్థానంలో నిలిచాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అబ్బాస్ 17 వికెట్లు పడగొట్టాడు. సిరీస్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన 28 ఏళ్ల అబ్బాస్ అద్భుత బౌలింగ్‌తో పాక్ 373 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు 14వ స్థానంలో ఉన్న అబ్బాస్ ఏకంగా 3వ స్థానానికి ఎగబాకి దక్షిణాఫ్రికా క్రికెటర్ కగిసొ రబడ, ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్‌లకు చేరువయ్యాడు. ఇంతవరకు 10 టెస్టులు ఆడిన అబ్బాస్ 59 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన పాక్ రెండో ఫాస్ట్ బౌలర్‌గా దిగ్గజ పేసర్ వకార్ యూనిస్, షబ్బీర్ అహమ్మద్ సరసన నిలిచాడు. కాగా, పాకిస్తాన్ లెగ్‌స్పిన్నర్ యాసిర్ షాకు 9 టెస్టుల్లో 50 వికెట్లు తీసిన రికార్డు ఉంది.