క్రీడాభూమి

అథ్లెట్లకు మరిన్ని ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనే అథ్లెట్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను రెట్టింపు చేయాలని, బిజినెస్ క్లాస్‌లలో విమానాల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు విజ్ఞప్తి చేశాడు. బ్యూనోస్ ఎయిరెస్‌లో ఇటీవల జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో వివిధ పతకాలు సాధించిన అథ్లెట్లకు నగదు పురస్కారాల ప్రదానం ఆదివారం ఇక్కడ జరిగింది. యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ విజేతకు మూడు లక్షలు, రజత పతక విజేతకు లక్షన్నర, కాంస్య పతక విజేతకు లక్ష రూపాయల వంతున ఈ సందర్భంగా నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఓఏ సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీలకు వెళ్లే అధికారులకు బిజినెస్ క్లాస్‌లలో విమానాల్లో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుండగా, అథ్లెట్లు మాత్రం ఎకానమీ క్లాసులో ప్రయాణించాల్సి వస్తుండడం విచారించగదగ్గ విషయమని పేర్కొన్నాడు. ఈ విషయంలో అథ్లెట్లకు కూడా బిజినెస్ క్లాసుల్లో ప్రయాణించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, కేంద్ర క్రీడల శాఖ కార్యదర్శి రాహుల్ భట్నాగర్‌లకు విజ్ఞప్తి చేశాడు. ‘అథ్లెట్లకు ఆహారం కోసం ఇస్తున్న భత్యాలను 450 రూపాయల నుండి 1000 రూపాయలకు పెంచాలి. అథ్లెట్లకు ప్రోత్సాహకాలు పెంచడం వల్ల ‘శాయ్’లో వచ్చే ఏడాది జరిగే ఈవెంట్‌లో ఆశాజనకమైన ఫలితాలు రాబట్టేందుకు భరోసా ఇస్తున్నాను. ఈ విషయంలో కేంద్ర క్రీడల మంత్రి తగిన హామీ ఇవ్వాలి’ అని మెహతా విజ్ఞప్తి చేశాడు. ఐఓఏ అధ్యక్షుడు నరేంద్ర బాత్రా జూనియర్ లెవెల్‌లో సాధించిన విజయగర్వంతో అథ్లెట్లు నిర్లక్ష్యం వీడాలని సున్నితంగా హెచ్చరించాడు. ఇందుకు ఉదాహరణంగా జూనియర్ వరల్డ్ కప్ హాకీ విజేతలపై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఓటమితో నిరాశపరిచిన విషయాన్ని గుర్తు చేశాడు. ‘యూత్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా 2020 టోక్యో ఒలింపిక్స్‌పై దృష్టి సారించాలి. ఏ పోటీలో పాల్గొన్నా విజయమే లక్ష్యంగా దూసుకుపోవాలి’ అని బాత్రా సూచించాడు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తరఫున అథ్లెట్లకు ఎల్లప్పుడూ తగిన మద్దతు, ప్రోత్సాహం ఉంటుందని అన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌తోపాటు 2024 గేమ్స్‌పై కూడా అథ్లెట్లు దృష్టిని కేంద్రీకరించాలని, అందుకు తగ్గట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చాడు. యూత్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆయా అంశాలపై మరింత దృష్టి పెట్టడం వల్ల ఒలింపిక్ వంటి పోటీల్లో విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు.

యూత్ ఒలింపిక్ విజేతలతో ప్రధాని భేటీ
బ్యూనోస్ ఎయిరెస్‌లో ఇటీవల జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో 13 ఉత్తమ పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్‌లో గోల్డ్‌మెడల్ విజేత మను భాకర్, రజత పతక విజేతలు, హాకీ విజేతలైన పురుషులు, మహిళల జట్ల ఆటగాళ్లు వంటివారితో కలిసి దిగిన ఫొటోలను ప్రధాని ట్వీట్ చేశారు. ‘యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో వివిధ పతకాలు సాధించిన యువశక్తిని చూసి నేను చాలా గర్విస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ పోటీల్లో భారత అథ్లెట్లు మూడు గోల్డ్ మెడల్స్, తొమ్మిది రజత పతకాలు, ఒక కాంస్య పతకం గెల్చుకున్నారు.