క్రీడాభూమి

విరో‘హిట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి వనే్డలో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. ఐదు వనే్డలలో భాగంగా ఆదివారం ఇక్కడి బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వనే్డలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ 78 బంతుల్లో ఆరు సిక్సర్లు, మరో ఆరు బౌండరీలతో 106 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఓపెనర్ కీరన్ పవెల్ 39 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఆరు బౌండరీలతో 51 పరుగులు చేసి ఖలీల్ అహమ్మద్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ జాసన్ రాయ్ 38 పరుగులు, వికెట్ కీపర్ షాల్ హోప్ 32, కెమర్ రోచ్ 26 నాటౌట్, దేవేంద్ర బిషూ 22 నాటౌట్, రోవ్‌మన్ పవెల్ 22, చంద్రపాల్ హెమ్‌రాజ్ 9, ఆష్‌లీ నర్స్ 2 పరుగులు చేశారు. మార్లన్ శామ్యూల్స్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. కాగా, భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 3 వికెట్లు, రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 66 పరుగులిచ్చి 2, మహమ్మద్ షమీ 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి 2, ఖలీల్ అహమ్మద్ 10 ఓవర్లలో 64 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం 323 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన టీమిండియా 42.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 6 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 4 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. 107 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 2 సిక్సర్లు, 21 బౌండరీలతో 140 పరుగులు చేసి బిషూ బౌలింగ్‌లో షాల్ హోప్ చేతిలో స్టంపవుట్ అయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ క్రీజులో చివరివరకు నిలదొక్కుకుని సిక్సర్లు, బౌండరీల వరద పారించాడు. 117 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 8 సిక్సర్లు, 15 బౌండరీలతో 152 పరుగులతో, 26 బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు ఒక సిక్సర్, మరో బౌండరీతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.