క్రీడాభూమి

రోహిత్ శర్మ సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 22: టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. వనే్డలలో ఆరుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి వనే్డలో రోహిత్ శర్మ 117 బంతులు ఎదుర్కొని 152 పరుగులు సాధించాడు. వనే్డలలో ఇది ఆయనకు 20వ సెంచరీ కావడం విశేషం.
2013 నవంబర్‌లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 209 పరుగులు చేశాడు. 2014 నవంబర్‌లో కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు, 2015 అక్టోబర్‌లో కాన్పూర్‌లో దక్షిణాఫ్రికాపై 150 పరుగులు, 2016 జనవరిలో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగులు (నాటౌట్), 2017 డిసెంబర్‌లో మొహలీలో శ్రీలంకపై 208 పరుగులు (నాటౌట్), 2018 అక్టోబర్‌లో గౌహతిలో వెస్టిండీస్‌పై 152 పరుగులు (నాటౌట్) చేశాడు. కాగా, వనే్డలలో 150కి పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లలో క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలావుండగా వనే్డలలో ఆరుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మను టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందించాడు.