క్రీడాభూమి

సచిన్ రికార్డుకు చేరువగా రోహిత్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం, అక్టోబర్ 23: గౌహతిలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వనే్డలో అద్భుత ఆటతీరుతో 152 పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరనుంది. తొలి వనే్డలో రోహిత్ సాధించిన 152 పరుగుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో వనే్డలలో 194 సిక్సర్లు సాధించినట్లయింది. వనే్డలలో ఇంతవరకు టీమిండియా తరఫున ఆడిన క్రికెటర్లలో దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్ సాధించిన 195 సిక్సర్లు ఇప్పటివరకు ఒక రికార్డుగా ఉంది. రోహిత్ శర్మ ఈ రికార్డును సమం చేయడంతోపాటు అధిగమించనున్నాడు. విశాఖపట్టణంలో బుధవారం జరిగే రెండో వనే్డలో రోహిత్ శర్మ మరో సిక్స్ కొడితే సచిన్ తెండూల్కర్ సిక్సర్ల రికార్డుకు సమం అవుతుంది. వనే్డలలో 190 సిక్సర్లు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును వెస్టిండీస్‌తో జరిగిన తొలి వనే్డలో రోహిత్ శర్మ అధిగమించాడు. టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డలలో ఇప్పటివరకు 217 సిక్సర్లు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా ఉన్నాడు. కాగా, పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది పేరిట వనే్డలలో 351 సిక్సర్లు చేసిన రికార్డు ఉంది. ఆ తర్వాత స్థానంలో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ 275 సిక్సర్లు, మూడో స్థానంలో శ్రీలంక బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య 270 సిక్సర్లతో ఉన్నాడు.