క్రీడాభూమి

మేం మరింత బాగా ఆడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 23: గౌహతి వనే్డలో 322 పరుగుల భారీ స్కోరు సాధించినా కోహ్లీ, రోహిత్ శర్మ శతకాల ఇన్నింగ్స్ కారణంగా ఓడిపోయామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. మంగళవారం నెట్స్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆట ప్రారంభంలో మూడు, నాలుగు వికెట్లు పడగొట్టి ఉంటే భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టేవారమన్నాడు. తమ బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్నాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించడం తమలో విశ్వాసాన్ని పెంచిందని, అయితే బౌలింగ్‌లో మరింత పదును కనబర్చాల్సి ఉందన్నారు. జట్టులో షిమ్రాన్ హెట్‌మెయర్ అద్భుతమైన సెంచరీ, పావెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారన్నాడు. విశాఖ వికెట్ చాలా బాగుందని పిచ్‌మీద ఎలాంటి పచ్చికా లేదన్నాడు. జట్టులో స్పిన్నర్లు తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయారని, అదే తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నారు. యువ ఆటగాడు చంద్రపాల్ హేమరాజ్ టాప్ ఆర్డర్‌లో చక్కని ప్రతిభ కనబరుస్తున్నాడని చెప్పాడు.
అంబటి రాయుడు మాట్లాడుతూ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం తనకేమీ కొత్త కాదని, తనపై ఎలాంటి వత్తిడీ లేదని భారత్ జట్టు బ్యాట్స్‌మెన్ అంబటిరాయుడు అన్నాడు. టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడుతున్నపుడు మిడిల్ ఆర్డర్‌పై ఎలాంటి వత్తిడి ఉండదని చెప్పాడు. తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తున్నానని చెప్పాడు. వెస్టిండీస్ బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ రోహిత్‌శర్మ, కోహ్లీల అద్భుతమైన బ్యాటింగ్ ముందు నిలువలేకపోయారన్నాడు. జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్లు ఉండటం విజయానికి కారణమన్నారు. 2002లో తన కెరీర్‌ను ప్రారంభించానని, అయితే అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి 2013 వరకు వేచి ఉండాల్సి వచ్చిందని చెప్పాడు. చిన్న,చిన్న గాయాలు తనను ఇబ్బందిపెడుతున్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్‌లకు ముందు తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుచుకుంటానన్నాడు.
చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న విండీస్ కెప్టెన్ హోల్డర్, భారత జట్టు ప్రతినిధి అంబటి రాయుడు