క్రీడాభూమి

ఆధిపత్యం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం, అక్టోబర్ 23: టాప్ ఆర్డర్ విజృంభించడంతో తొలి వనే్డలో 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా బుధవారం విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగే రెండో వనే్డలో సైతం ఆధిపత్యం కోసం ఎదురుచూస్తోంది. మరోపక్క టెస్టు సిరీస్‌ను జారవిడుచుకున్నా కనీసం వనే్డ సిరీస్‌లోనైనా పరువు నిలుపుకునేందుకు వెస్టిండీస్ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. 5 వనే్డల సిరీస్‌లో భాగంగా గౌహతిలో ఆదివారం జరిగిన తొలి వనే్డలో ఓటమిని చవిచూసిన వెస్టిండీస్ కనీసం రెండో వనే్డలోనైనా కోహ్లీ సేన దూకుడును అడ్డుకునేందుకు తద్వారా మనుగడ కోసం తహతహలాడుతోంది. ఏరకంగా చూసుకున్నా వెస్టిండీస్ కంటే భారత్ జట్టు బలంగా ఉన్న నేపథ్యంలో గట్టి పోటీ ఇస్తామనే బలంగా నమ్ముతున్నామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. టీమిండియా సొంత గడ్డ, ఇదే వేదికపై కొనే్నళ్ల క్రితం జరిగిన ఒక మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో భారత్ తొలిసారిగా ఓటమిని చవిచూసింది. మళ్లీ ఇదే మైదానంపై ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించి పోరాడతామని వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇదిలావుండగా, రెండో వనే్డలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు నమోదు అయ్యే అవకాశం ఉంది. విశాఖపట్టణంలో జరిగే రెండో వనే్డలో కోహ్లీ మరో 81 పరుగులు చేస్తే వనే్డలలో త్వరితగతిన 10వేల పరుగులు చేసిన దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10వేల పరుగులు చేయగా, కోహ్లీ కేవలం 204 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించనున్నాడు. తొలి వనే్డలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి త్వరితగతిన సెంచరీ నమోదు చేయడంతోపాటు 50 ఓవర్ల ఆటను మరో 8 ఓవర్లు మిగిలి ఉండగానే ముగించిన ఘనతను కోహ్లీ సేన సాధించింది. టీమిండియాలో మిడిలార్డర్ బలంగా ఉండడంతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ముద్రపడిన జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటివారు తొలి వనే్డలో లేకున్నా మిగిలిన బౌలర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. దీంతో ఆ వనే్డలో వెస్టిండీస్ 322 పరుగుల భారీ పరుగులతో టీమిండియాకు సవాల్ విసిరింది. రెండో వనే్డలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, చైనామన్ కుల్దీప్ యాదవ్ వంటివారు అద్భుతంగా రాణిస్తే ప్రత్యర్థిని పరిమిత పరుగులకే కట్టడి చేయవచ్చు. కాగా, తొలి వనే్డలో 78 బంతుల్లో 106 పరుగులు చేసిన వెస్టిండీస్ ఆటగాడు సిమ్రాన్ హెట్‌మెయిర్ రెండో వనే్డలోనూ అదే ఆటతీరును కనబరిచే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా మంచి ఫామ్‌లో ఉన్న కీరన్ పవెల్, మార్లన్ శామ్యూల్స్‌తో సహా కెప్టెన్ జాసన్ హోల్డర్, దేవేంద్ర బిషూ తొలి వనే్డలో ఆడలేకపోయిన పేసర్ కెమర్ రోచ్ వంటివారు రెండో వనే్డలో పరుగుల వరద పారించే సత్తా ఉండడంతో వీరిపై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది.
చిత్రాలు.. నెట్ ప్రాక్టీస్‌లో భారత్ వికెట్ కీపర్ మహీంద్ర సింగ్ ధోని
*ఫుట్‌బాల్ ఆడుతున్న విండీస్ ఆటగాళ్లు