క్రీడాభూమి

‘హోప్’ ఇచ్చాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం జరిగిన రెండో వనే్డ టైగా ముగిసింది. తొలి వనే్డలో భారీ స్కోరు చేసినా అన్నివిభాగాల్లో పటిష్టమైన టీమిండియా చేతిలో ఎదురైన పరాజయంతో వెస్టిండీస్ బౌలర్ల సత్తాపైనే రెండో ఆధారపడి ఉంటుందని సభ్యులకు రెండో వనే్డకి ముందు దిశానిర్దేశం చేసిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆదేశాలను సహచరులు తూ.చ. తప్పకుండా పాటించారు. పర్యవసానమే రెండో వనే్డలో ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లోనూ రాణించి ఔరా అనిపించినా మ్యాచ్ టైగా ముగియడంతో కాస్త నిరాశ చెందారు.
*
విశాఖపట్టణం, అక్టోబర్ 24: వెస్టిండీస్‌తో బుధవారం ఇక్కడి డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో వనే్డ టైగా ముగిసింది. గౌహతిలో జరిగిన తొలి వనే్డలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన రెండో వనే్డలోనూ విజృంభించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసిన టీమిండియా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యా నే్న ఉంచినా వెస్టిండీస్ ఈ లక్ష్యాన్ని అతి సునాయాసంగా ఛేదించి వనే్డల సిరీస్‌ను 1-1తో సమం చేయాలనుకున్నా సాధ్యపడలేదు. టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 8 బంతు లు ఎదుర్కొని ఒక బౌండరీతో 4 పరుగులు చేసి రోచ్ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. తొలి వనే్డలో రోహిత్ అత్యధిక పరుగులు చేసిన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ 30 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, 4 బౌండరీలతో 29 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో భారమంతా మిడిలార్డర్‌లో వచ్చిన కోహ్లీ, అంబటి రాయుడిపై పడింది. 129 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 4 సిక్సర్లు, 13 బౌండరీలతో 157 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంబటి రాయుడు 80 బంతులు ఎదుర్కొని 8 బౌండరీలతో 73 పరుగులు చేసి ఏ.నర్స్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ ధోనీ 20, రిషబ్ పంత్ 17, రవీంద్ర జడేజా 13 పరుగులు చేసి ఒబెద్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో కే.పవెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. మహమ్మద్ షమీ 1 బంతిని ఎదుర్కొని నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఆష్‌లే నర్స్ 10 ఓవర్లలో 46 పరుగులు, ఒబెద్ మెక్‌కాయ్ 10 ఓవర్లలో 71 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మారిన్ శామ్యూల్స్ 5 ఓవర్లలో 36, కెమర్ రోచ్ 10 ఓవర్లలో 67 పరుగులిచ్చి చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 322 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. తొలి వనే్డలో సెంచరీ కొట్టిన షిమ్రాన్ హెట్‌మెయిర్ రెండో వనే్డలో తృటిలో సెంచరీని కోల్పోయాడు. 64 బంతులు ఎదుర్కొన్న హెట్‌మెయిర్ 7 సిక్సర్లు, 4 బౌండరీలతో 94 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ షాల్ హోప్ 134 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, 10 బౌండరీలతో 123 పరుగులతో ఆకట్టుకోగా మిగతా బ్యాట్స్‌మెన్లు చెప్పుకోదగిన పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

చిత్రం.. షాల్ హోప్- 123