క్రీడాభూమి

సాహో విరాట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాట్స్‌మన్

*భారత్ తరఫున 10వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాట్స్‌మన్

*మ్యాచ్‌లు 213

*ఇన్నింగ్ సలు 205

విశాఖపట్టణం, అక్టోబర్ 24: పరుగుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10వేల పరుగుల క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు. విశాఖపట్టణంలోని డా. వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన రెండో వనే్డలో కోహ్లీ కేవలం 213 వనే్డల్లోనే 10వేల పరుగులు సాధించి, అగ్రస్థానంలో నిలిచిన దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. రెండు దశాబ్దాల కిందట క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీ 29 ఏళ్ల ప్రాయంలోనే ఎన్నో రికార్డులను తిరగరాశాడు. సచిన్ తెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో (266 వనే్డలు) 10వేల పరుగులు సాధించగా, విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే (213 వనే్డ లు) ఈ ఘనత సాధించాడు. దీంతో 10వేల పరుగులు చేసిన 13 మంది బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా కూడా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.