క్రీడాభూమి

పదివేల క్లబ్‌లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 24: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో పదివేల పరుగుల మైలురాయిని అధిగమించిన క్రికెటర్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడు. వెస్టిండీస్‌తో బుధవారం విశాఖపట్నంలో జరిగిన వనే్డలో సెంచరీ సాధించిన అతను పదివేల పరుగుల క్లబ్‌లో చోటు సంపాదించాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా, మొత్తంమీద 13వ బ్యాట్స్‌మన్‌గా అతను చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు.
వనే్డల్లో పదివేలకుపైగా
పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్
1. సచిన్ తెండూల్కర్ (్భరత్/ 463 మ్యాచ్‌లు/ 18,426 పరుగులు), 2. కుమార సంగక్కర (శ్రీలంక/ 404 మ్యాచ్‌లు/ 14,234 పరుగులు), 3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా/ 375 మ్యాచ్‌లు/ 13,704 పరుగులు), 4. సనత్ జయసూర్య (శ్రీలంక/ 445 మ్యాచ్‌లు/ 13,430 పరుగులు), 5. మహేల జయవర్ధనే (శ్రీలంక/ 448 మ్యాచ్‌లు/ 12,650 పరుగులు), 6. ఇంజమాముల్ హక్ (పాకిస్తాన్/ 378 మ్యాచ్‌లు/ 11,739 పరుగులు), 7. జాక్వెస్ కాలిస్ (దక్షిణాఫ్రికా/ 328 మ్యాచ్‌లు/ 11,579 పరుగులు), 8. సౌరవ్ గంగూలీ (్భరత్/ 311 మ్యాచ్‌లు/ 11,363 పరుగులు), 9. రాహుల్ ద్రవిడ్ (్భరత్/ 344 మ్యాచ్‌లు/ 10,889 పరుగులు), 10. బ్రియాన్ లారా (వెస్టిండీస్/ 299 మ్యాచ్‌లు/ 10,405 పరుగులు), 11. దిల్షాన్ తిలకరత్నే (శ్రీలంక/ 330 మ్యాచ్‌లు/ 10,290 పరుగులు), 12. మహేంద్ర సింగ్ ధోనీ (్భరత్/ 324 మ్యాచ్‌లు/ 10,123 పరుగులు), 13. విరాట్ కోహ్లీ (్భరత్/ 231 మ్యాచ్‌లు/ 205 ఇన్నింగ్స్‌లో 10,076 పరుగులు).