క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌కు డ్వెయిన్ బ్రేవో గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, అక్టోబర్ 25: వెస్టిండీస్‌కు చెందిన ఎంటర్‌డైనింగ్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, భారలత్‌లో ఐపీఎల్ మాదిరి వివిధ దేశాల్లో జరిగే టీ-20 ఫార్మాట్ టోర్నీల్లో పాల్గొంటానని ప్రకటించాడు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన 35 ఏళ్ల డ్వెయిన్ బ్రేవో 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. కెరీర్‌లో 40 టెస్టుల్లో 71 ఇన్నింగ్స్ ఆడిన అతను 2,200 పరుగులు సాధించాడు. 113 పరుగులు అతని అత్యధిక స్కోరు. మొత్తం మూడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 6,466 బంతులు వేసి, 3,426 పరుగులిచ్చి 86 వికెట్లు కూల్చాడు. 55 పరుగులకు 6 వికెట్లు టెస్టుల్లో అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ.
వనే్డ ఫార్మాట్‌లో 164 మ్యాచ్‌లు (141 ఇన్నింగ్స్) ఆడిన డ్వెయిన్ బ్రేవో 2,968 పరుగులు చేశాడు. 112 (నాటౌట్) అతని అత్యుత్తమ స్కోరు. రెండు శతకాలు, మరో 10 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో 6,511 బంతులు వేసిన అతను 5,874 పరుగులిచ్చాడు. 199 వికెట్లు పడగొట్టాడు. 43 పరుగులకు 6 వికెట్లు వనే్డల్లో అతని అత్యుత్తమ బౌలింగ్‌గా నమోదైంది.
కెరీర్‌లో 66 టీ-20 మ్యాచ్‌లు (59 ఇన్నింగ్స్) ఆడిన డ్వెయిన్ బ్రేవో 1,142 పరుగులు సాధించాడు. అత్యుత్తమంగా 66 (నాటౌట్) పరుగులు చేశాడు. సెంచరీ సాధించలేకపోయిన అతని ఖాతాలో నాలుగు అర్ధ శతకాలున్నాయి. ఈ ఫార్మాట్‌లో 1,042 బంతులు బౌల్ చేశాడు. 1,470 పరుగులు ఇచ్చాడు. 52 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 28 పరుగులకు 4 వికెట్లు కూల్చాడు.
అన్ని ఫార్మాట్స్‌లోనూ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనట్టు అధికారికంగా ప్రకటించిన డ్వెయిన్ బ్రేవో వివిధ దేశాల్లో జరిగే ఫ్రాంచైజీ పోటీలకు అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, మొదటిసారి వెస్టిండీస్ జాతీయ జట్టు టోపీని అందుకున్న సంఘటన తనకు చాలా కొత్తగానే ఉంటుందని అన్నాడు. కెరీర్ మొత్తంలో తాను విండీస్‌కు అత్యుత్తమ సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని తెలిపాడు. ప్రస్తుతానికి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగిస్తానని, ఆతర్వాత ఏం చేయాలన్నది ఆ తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పాడు.