క్రీడాభూమి

వనే్డ జట్టులోకి మళ్లీ భువీ, బుమ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాకు మళ్లీ వనే్డ జట్టులో చోటు లభించింది. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో చివరి మూడు మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ గురువారం జట్టును ఎంపిక చేసింది. అదే విధంగా టీ-20 సిరీస్‌కు జట్టును శుక్రవారం ప్రకటించనుంది. ఇదే జట్టు ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లోనూ ఆడుతుందని అంటున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో రెండు టెస్టుల్లో, ఆతర్వాత జరిగిన మొదటి రెండు వనే్డల్లోనూ ఆడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌ను దృష్టిలో ఉంచుకొని, అతనికి విశ్రాంతినివ్వాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అయితే, ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ విండీస్‌తో మిగతా మూడు వనే్డలకు ప్రకటించిన జట్టులోనూ కోహ్లీని చేర్చింది. దీనితో అతను వనే్డ సిరీస్‌ను పూర్తిగా ఆడనున్నాడు. టీ-20 సిరీస్ నుంచి అతనికి విశ్రాంతినిస్తారా అన్న సస్పెన్స్‌కు శుక్రవారం తెరపడుతుంది.
ఇలావుంటే, విండీస్‌తో చివరి మూడు వనే్డలు ఆడే టీమిండియాలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. రెండు మ్యాచ్‌లు ఆడిన అతను వరుసగా 81, 59 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. దీనితో సెలక్టర్లు అతనిని పక్కకుపెట్టారు. అయితే, మొదటి వనే్డలో 64, రెండో మ్యాచ్‌లో 78 చొప్పున పరుగులిచ్చిన ఉమేష్ యాదవ్ మాత్రం విచిత్రంగా జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. అతనిని స్టాండ్ బై పేసర్‌గా ఉంచాలన్నది సెలక్షన్ కమిటీ అభిప్రాయం కావచ్చని అంటున్నారు. కాగా, యువ సంచలన బ్యాట్స్‌మన్ పృథ్వీ షాకు చివరి మూడు వనే్డల్లో ఆడే అవకాశం దక్కుతుందన్న వాదన బలంగా వినిపించింది. కానీ, దేవధర్ ట్రోఫీలో ఆడుతూ గాయపడిన అతను గురువారం నాటి మ్యాచ్‌లో పాల్గొనలేకపోయాడు. ఈ కారణంగానే సెలక్టర్లు అతనిని వనే్డ జట్టులో చేర్చలేదు.

చివరి మూడు వనే్డలకు జాతీయ ఎలక్షన్ కమిటీ
ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన
భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషభ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జుయువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేష్ యాదవ్, లోకేష్ రాహుల్, మనీష్ పాండే.
చిత్రం.. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా