క్రీడాభూమి

జపాన్‌పై సత్తా చాటేందుకు భారత్ తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్కట్, అక్టోబర్ 26: డిఫెండింగ్ హాకీ చాంపియన్ భారత్ ఖండాంతర ఆధిపత్యం కోసం తహతహలాడుతోంది. శనివారం ఇక్కడ జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) సెమీఫైనల్స్‌లో ఆసియా గేమ్స్ గోల్డ్‌మెడలిస్టు జపాన్‌తో తలపడనుంది. భారత్ ఇప్పటివరకు వివిధ స్టేజీలలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో (ఒమన్‌పై 11-0, పాకిస్తాన్‌పై 3-1, జపాన్‌పై 9-0, దక్షిణకొరియాపై 4-1తో గెలుపు) ఒక్క మలేషియాతో తప్ప మిగిలిన మ్యాచ్‌లలో గెలుపుద్వారా 13 పాయింట్లతో టాప్ టీమ్‌గా నిలబడింది. ఆసియా క్రీడల్లో కేవలం కాంస్య పతకంతోనే సరిపెట్టుకుని అసంతృప్తితో ఉన్న భారత్ సెమీస్‌లో జపాన్‌పై పైచేయి సాధించేందుకు శక్తియుక్తులను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. భారత హాకీ జట్టు కోచ్ హరేంద్ర సింగ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శనివారం జపాన్‌తో తమ జట్టు తలపడే మ్యాచ్ పూర్తిగా కొత్త అనుభూతులను పంచుతుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజమైన ఆటతీరుతోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా పోరాడాలని తమ జట్టు ఆటగాళ్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు తెలిపాడు.