క్రీడాభూమి

ఆధిపత్యమే భారత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వనే్డల సిరీస్‌లో భాగంగా శనివారం పుణేలో జరిగే మూడో వనే్డ మ్యాచ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా ఆధిపత్యం చెలాయించాలని కోహ్లీ సేన యోచిస్తోంది. తొలి వనే్డలో గెలుపుతో రెండో వనే్డలోనూ ఆధిపత్యం చెలాయించడం ద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకున్న కోహ్లీ సేనకు నిరాశే ఎదురైంది. మరోపక్క గౌహతిలో జరిగిన తొలి వనే్డలో 8 వికెట్ల తేడాతో ఓటమి చెందినా విశాఖపట్టణంలో జరిగిన రెండో వనే్డలో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చినా దురదృష్టవశాత్తూ టైగా ముగించి మ్యాచ్‌ను చేజార్చుకున్నా మూడో వనే్డలో మరింత పోటీ ఇవ్వగలమని జాసన్ హోల్డర్ నేతృత్వంలోని కరేబియన్ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. తొలి వనే్డలో వెస్టిండీస్ 322 భారీ స్కోరు ప్రత్యర్థి ముందు ఉంచినా అతి సునాయాసంగా కోహ్లీ సేన ఛేదించింది. రెండో వనే్డలో సైతం టీమిండియా 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఎదుట ఉంచినా దానిని వెస్టిండీస్ ఆఖరిక్షణంలో ఛేదించలేకపోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే, ఇపుడు శనివారం పుణే వేదికగా ఇరు జట్ల మధ్య మూడో వనే్డలో ఆధిపత్యం కోసం భారత్, మనుగడ కోసం వెస్టిండీస్ తమ శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. తొలి వనే్డలో టీమిండియాలో చోటుదక్కని పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు మూడో వనే్డ సహా మిగిలిన రెండు వనే్డల్లోనూ ఆడేందుకు చాన్స్ దొరికింది. అయితే, మొదటి, రెండో వనే్డలలో భువీ, బుమ్రా లేకున్నా భారత్ 320కి పైగా పరుగులు చేసింది. ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ కంటే భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాల ఆటతీరు భిన్నంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా తొలి పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో భువీ, బుమ్రాల వ్యవహార శైలి ప్రత్యేకమైనది. మరోపక్క వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరుగనున్న వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా ఇంకా 16 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో మిడిలార్డర్, లోవర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లపై దృష్టి సారించింది. రెండు వనే్డలలోనూ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతోపాటు విశాఖపట్టణంలో జరిగిన రెండో మ్యాచ్‌లో త్వరితగతిన, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 10వేల పరుగులు సాధించిన దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్‌ను దాటేశాడు. ఆ మ్యాచ్‌లో 157 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ వెస్టిండీస్‌తో జరుగుతున్న వనే్డ సిరీస్‌లో ఇప్పటి 297 పరుగులు చేశాడు. మరోపక్క బ్యాటింగ్‌లో నాలుగో బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు 73 పరుగులతో రెండో మ్యాచ్‌లో రాణించడంతో ఈ సిరిసీలో మిగిలిన వనే్డలకు అతని స్థానం దాదాపు పదిలం కావొచ్చు. అయితే, జట్టులో ముఖ్యంగా వేధిస్తున్న మరో సమస్య బ్యాటింగ్‌లో 5, 6, 7. మహేంద్ర సింగ్ ధోనీ రెండో వనే్డలో కేవలం 20 పరుగులు చేయగా, భారీ స్కోరు సాధిస్తాడనుకున్న యువ క్రికెటర్ రిషబ్ పంత్ రెండో మ్యాచ్‌లో కేవలం 17 పరుగులతో నిరాశపరిచినా మూడో వనే్డలో మార్పు జరగవచ్చుననే ఉద్దేశంతో అతనిని కొనసాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటివారు వెట్ బాల్‌తో ఆడేందుకు సతమతమవుతున్నట్టు యాజమాన్యం గ్రహించడంతో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నాడు.
మరోపక్క వెస్టిండీస్ టీమ్‌లో యువ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మెయిర్ గౌహతిలో జరిగిన తొలి వనే్డలో 106 పరుగులు, విశాఖపట్టణంలో జరిగిన రెండో వనే్డలో 94 పరుగులు చేసి భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ రెండో వనే్డలో సెంచరీ (123)తో జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరితోపాటు మిగిలిన బ్యాట్స్‌మెన్‌లలో కీరోన్ పవెల్, చంద్రపాల్ హెమ్‌రాజ్, రోవ్‌మన్ పవెల్ వంటివారు మిగిలిన మూడు వనే్డలలో రాణించగలరనే జట్టు యాజమాన్యం బలంగా నమ్ముతోంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రెండో మ్యాచ్‌లో మార్లోన్ శామ్యూల్స్ (13), కెప్టెన్ జాసన్ హోల్డర్ (50) చేసినా వారి ఆటతీరుకు తగిన విధంగా వ్యవహరించలేదనేది నిర్వివాదాంశం. తదుపరి మ్యాచ్‌లలో వీరిద్దరితోపాటు బౌలింగ్‌లో అద్భుత సామర్థ్యం కలిగిన కెమర్ రోచ్, స్పిన్నర్లు దేవేంద్ర బిషూ, ఆష్‌లే నర్స్‌తోపాటు కెప్టెన్ హోల్డర్, ఒషానే థామస్ వంటివారు అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తే కెప్టెన్ కోహ్లీ, రోహిత్, రాయుడు వంటివారిని త్వరితగతిన కట్టడి చేయవచ్చునని యాజమాన్యం యోచిస్తోంది.