క్రీడాభూమి

కోహ్లీ సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 27: పుణే వేదికగా శనివారం జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ సాధించినప్పటికీ, వెస్టిండీస్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్ 43 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రెండో వనే్డలో గట్టిపోటినిచ్చి, మ్యాచ్‌ని ‘టై’ చేసుకున్న వెస్టిండీస్ మూడో మ్యాచ్‌లో విజయభేరి మోగించి, సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1గా సమం చేసుకుంది.
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా గౌహతిలో జరిగిన తొలి వనే్డలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, విశాఖపట్టణంలో జరిగిన రెండో వనే్డ టైగా ముగిసిన విషయం తెలిసిందే. దీనితో పుణే వనే్డ ఇరు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. షాయ్ హోప్ వీరోచితంగా పోరాడి 95 పరుగులు సాధించాడు. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన అతను ఐదు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. షిమ్రన్ హేత్‌మెయర్ 37, కెప్టెన్ జాసన్ హోల్డర్ 32 పరుగులతో ఆదుకోగా, చివరిలో ఆష్లే నర్స్ 40 పరుగులు సాధించి, విండీస్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించే ప్రయత్నం చేశాడు. 10 ఓవర్లు బౌల్ చేసిన బుమ్రా 35 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 52 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, యుజువేంద్ర చాహల్‌కు తలా ఒక్కో వికెట్ దక్కింది.
విండీస్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా కేవలం తొమ్మిది పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను రోహిత్ శర్మ రూపంలో కోల్పోయింది. ఎనిమిది పరుగులు చేసిన అతను జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఆష్లే నర్స్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. అంబటి రాయుడు 22 పరుగులకు ఒబెద్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో బౌల్డ్‌కాగా, రిషభ్ పంత్ 24 పరుగులు చేసి, ఆష్లే నర్స్ బౌలింగ్‌లో షాయ్ హోప్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. సీనియర్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఏడు పరుగులు చేసి, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో షాయ్ హోప్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగి, అభిమానులను నిరాశపరిచాడు. భువనేశ్వర్ కుమార్ 10 పరుగులు చేసి ఔట్‌కాగా, క్రీజ్‌లో నిలదొక్కుకొని సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ మార్లొన్ శామ్యూల్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 119 బంతులు ఎదుర్కొన్న అతను 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 107 పరుగులు చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది 38వ వనే్డ సెంచరీ. కాగా, యుజువేంద్ర చాహల్ (3), ఖలీల్ అహ్మద్ (3), జస్‌ప్రీత్ బుమ్రా (0) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. అప్పటికి కుల్దీప్ యాదవ్ (15) నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో శామ్యూల్స్ మూడు వికెట్లు పడగొట్టగా, హోల్డర్, మెక్‌కాయ్, ఆష్లే నర్స్ తలా రెండేసి వికెట్లు సాధించారు.
స్కోరుబోర్డు:
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కీరన్ పావెల్ సీ రోహిత్ శర్మ బీ జస్‌ప్రీత్ బుమ్రా 21, చంద్రపాల్ హేమ్‌రాజ్ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ జస్‌ప్రీత్ బుమ్రా 15, షాయ్ హోప్ బీ జస్‌ప్రీత్ బుమ్రా 95, మార్లొన్ సామ్యూల్స్ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ ఖలీల్ అహ్మద్ 9, షిమ్రన్ హేత్‌మేయర్ స్టంప్డ్ మహేంద్ర సింగ్ ధోనీ బీ కుల్దీప్ యాదవ్ 37, రొవ్‌మన్ పావెల్ సీ రోహిత్ శర్మ బీ కుల్దీప్ యాదవ్ 4, జాసన్ హోల్డర్ సీ సబ్‌స్టిట్యూట్ (రవీంద్ర జడేజా) బీ భువనేశ్వర్ కుమార్ 32, ఫాబియాన్ అలెన్ సీ రిషభ్ పంత్ బీ యుజువేంద్ర చాహల్ 5, ఆష్లే నర్స్ ఎల్‌బీ బుమ్రా 40, రోచ్ 15 నాటౌట్, మెక్‌కాయ్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు: 10, మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 283.
వికెట్ల పతనం: 1-25, 2-38, 3-55, 4-111, 5-121, 6-197, 7-127, 8-227, 9-283.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-0-7-01, జస్‌ప్రీత్ బుమ్రా 10-1-35-4, ఖలీల్ అహ్మద్ 10-0-65-1, యుజువేంద్ర చాహల్ 10-1-56-1, కుల్దీప్ యాదవ్ 10-0-52-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ బీ జాసన్ హోల్డర్ 8, శిఖర్ ధావన్ ఎల్‌బీ ఆష్లే నర్స్ 35, విరాట్ కోహ్లీ బీ మార్లొన్ శామ్యూల్స్ 107, అంబటి రాయుడు బీ అబెద్ మెక్‌కాయ్ 22, రిషభ్ పంత్ సీ షాయ్ హోప్ బీ ఆష్లే నర్స్ 24, మహేంద్ర సింగ్ ధోనీ సీ షాయ్ హోప్ బీ జాసన్ హోల్డర్ 7, భువనేశ్వర్ కుమార్ సీ రోవ్‌మన్ పావెల్ బీ ఒబెద్ మెక్‌కాయ్ 5, కుల్దీప్ యాదవ్ 15 నాటౌట్, యుజువేంద్ర చాహల్ సీ సబ్‌స్టిట్యూట్ (కిమోపాల్) బీ కెమర్ రోచ్ 3, ఖలీల్ అహ్మద్ స్టంప్డ్ షాయ్ హోప్ బీ మార్లొన్ శామ్యూల్స్ 3, జస్‌ప్రీత్ బుమ్రా సీ జాసన్ హోల్డర్ బీ మార్లొన్ శామ్యూల్స్ 0, ఎక్‌స్ట్రాలు: 6, మొత్తం :(47.4 ఓవర్లలో ఆలౌట్) 240.
వికెట్ల పతనం: 1-9, 2-88, 3-135, 4-172, 5-194, 6-215, 7-220, 8-225, 9-237, 10-240.
బౌలింగ్: కెమర్ రోచ్ 10-0-48-1, జె. హోల్డర్ 9-0-46-2, ఒ.మెక్‌కాయ్ 5-0-38-2, ఆష్లే నర్స్ 10-0-43-2, ఫాబియన్ అలెన్ 10-0-57-0, శామ్యూల్స్ 3.4-1-12-3.