క్రీడాభూమి

వరల్డ్ కప్ వరకూ ధోనీకి ఒడిదుడుకులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్-వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల నుంచి ఉద్వాసన పలకడం వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్ వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేషనల్ సెలక్షన్ కమిటీ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ధోనీ వంటి సీనియర్ ఆటగాడిపై వేటుపడడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 37 ఏళ్ల ధోనీ టీమిండియా కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా ఎన్నో విజయాలను నమోదు చేశాడు. అయితే, కొత్తవారికి జాతీయ జట్టులో చోటు కల్పించాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, అలాగని ధోనీని పూర్తిగా టెస్టు మ్యాచ్‌ల నుంచి కూడా విశ్రాంతి ఇవ్వడం కాదని సెలక్టర్ల కమిటీ చైర్మ న్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్న విషయం తెలిసిందే. సెలక్షన్ కమిటీ తాజా నిర్ణయం వల్ల ధోనీ వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరిగే ఆరు టీ- 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు. 2020లో ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ వరల్డ్ టీ-20లో ధోనీ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ధోనీని పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించడం ద్వారా మరో ఐదుగురికి ఇందులో చోటు కల్పించవచ్చునని సెలక్షన్ కమిటీ ఆలోచన. అయితే, ఆరు టీ-20లకు ధోనీని తప్పించడం వల్ల వరల్డ్ టీ-20లో కూడా చోటు దక్కడం అనుమానమేనని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డాడు. కొత్తవారికి జట్టులో చోటు కల్పించాలన్న సెలక్టర్లు, జట్టు మేనేజిమెంట్ ఉద్దేశం ఆహ్వానించదగ్గదేనని వ్యాఖ్యానించాడు. ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారని, వారి అనుమతి లేకుండా ధోనీని టీ-20ల నుంచి తప్పించడం సాధ్యమేనా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ధోని ఏడు టీ-20లు ఆడాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన ఒక మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొని 52 పరుగులు చేశాడు. మిగిలిన ఆరు మ్యాచ్‌లలో కలిపి ధోనీ 51 బంతులు ఎదుర్కొని 71 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇపుడు వెస్టిండీస్‌తో జరుగుతున్న వనే్డలలో కూడా ఆడుతున్నాడు. అయితే, ఈ వనే్డల్లో ధోనీ చూపిన ప్రతిభ ఆధారంగానే రాను న్న ఇంగ్లాండ్ వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుం దా? లేదా? అన్న అంశం ముడిపడి ఉండే అవకాశం లేకపోలేదని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు జరిగే వివిధ వనే్డల ముందు దాదాపు రెండు నెలలపాటు జరిగే మ్యాచ్ ప్రాక్టీసులో కూడా ధోనీ పాల్గొనే అవకాశం దాదాపు లేనట్టే. పొట్టి ఫార్మాట్ల నుం చి ధోనీని తప్పించి, అతని స్థానంలో యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ వైపే సెలక్టర్లు ఎక్కువ శాతం మొగ్గు చూపడంతో అతని ఎంపికను సెలక్టర్లు సమర్థించుకుంటున్నారు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ-20లలో రిషబ్ పంత్ తన ఆటతీరుతో టీమ్ మేనేజిమెంట్‌ను మెప్పించిన పక్షంలో దాని ప్రభావం రానున్న వరల్డ్ కప్‌లో ధోనీ పాత్రపై పడే అవకాశం లేకపోలేదని క్రీడా పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ ఆటగాడు ధోనీ లేకుండా ఆడే వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ-20 సిరీస్‌లలో ఫలితం ఎలా ఉంటుందన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలావుండగా, వెస్టిండీస్‌తో జరుగుతున్న వనే్డ సిరీస్ ముగిసిన తర్వాత ధోనీ దేవధర, విజయ్ హజారే వంటి దేశవాళీ 50 ఓవర్ల మ్యాచ్‌లలో సైతం ఆడే అవకాశం కనిపించడం లేదు.