క్రీడాభూమి

విమర్శకులకు దీటుగా బదులిచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 28: తమను తక్కువ అంచనా వేస్తూ, విమర్శలు చేసిన వారికి సరైన సమాధానమిచ్చామని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆష్లే నర్స్ వ్యాఖ్యానించాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, వనే్డ సిరీస్‌లో విండీస్ గట్టిపోటీని ఇచ్చే అవకాశమే లేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేయగలిగామని, మూడో వనే్డలో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని ఇన్నింగ్స్ చివరిలో 22 బంతుల్లోనే 40 పరుగులు చేసి, జట్టును ఆదుకున్న నర్స్ పేర్కొన్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ఓపెనర్ శిఖర్ ధావన్, యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ వికెట్లు కూల్చిన నర్స్ ఈ విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని అన్నాడు. సమష్టిగా పోరాడామని, అందుకే గెలిచామని చెప్పాడు. నిలకడగా ఆడాలన్న సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటించే ప్రయత్నం చేశామని, ఆ వ్యూహమే తమకు లాభించిందని వివరించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనువుగా లేదన్న విమర్శలను నర్స్ తోసిపుచ్చాడు. తమ జట్టులో షాయ్ హోప్ 95 పరుగులు చేశాడని, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడనీ గుర్తుచేశాడు. వికెట్ అన్ని విధాలా వనే్డ మ్యాచ్‌కి అనువుగా ఉందని తెలిపాడు. మిగతా రెండు వనే్డల్లోనూ విజయాలను నమోదు చేసి, సిరీస్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.