క్రీడాభూమి

విజేందర్‌కు నాకౌట్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 1: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖాతాలో మరో నాకౌట్ విజయం చేరింది. ఫ్రెంచ్ బాక్సర్ మతియోజ్ రోయర్‌తో జరిగిన ఫైట్‌ను అతను టెక్నికల్ నాకౌట్‌లో ఓడించాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత విజేందర్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఆరు రౌండ్ల సూపర్ మిడిల్‌వెయిట్ విభాగంలో రోయర్‌తో తలపడిన 30 ఏళ్ల విజేందర్‌ను ఐదో రౌండ్‌లోనే రిఫరీ విజేతగా ప్రకటించాడు. కెరీర్‌లో 250 రౌండ్ల ఫైట్స్‌లో పాల్గొన్న అనుభవం ఉన్న రోయర్‌తో ఫైట్ చాలా కష్టమని ఈ పోరుకు ముందు విజేందర్ ప్రకటించాడు. అయితే, ఫైట్ మొదలైన తర్వాత తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రోయర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందంజ వేశాడు. లెఫ్ట్, రైట్ కాంబినేషన్‌తో వైవిధ్యాన్ని చూపిన విజేందర్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించాడు.
రోయర్‌తో జరిగిన ఫైట్‌లో గెలవడానికి తాను చాలా కష్టపడ్డానని విజేందర్ అన్నాడు. ఫైట్ ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ రోయర్‌ను గొప్ప ఫైటర్‌గా అభివర్ణించాడు. ఎంతో అనుభవం ఉన్న అతనిని ఓడించడం సులభం కాదని తనకు తెలుసునని అన్నాడు. అందుకే, అన్ని రకాలుగా ఫైట్‌కు సిద్ధమయ్యాయని అన్నాడు. తాను విసిరిన ప్రతి పంచ్ సక్రమంగా కనెక్ట్ అయిందని చెప్పాడు. వరుసగా ఐదో ఫైట్ గెల్చుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నదని తెలిపాడు. ఇలావుంటే ఈనెల 13న బోల్టన్‌లో జరిగే ఫైట్‌లో విజేందర్ పాల్గొంటాడు. ఇందులో అతని ప్రత్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ఆతర్వాత స్వదేశానికి వస్తాడు. జూన్‌లో డబ్ల్యుబివో ఆసియా టైటిల్ కోసం పోటీపడతాడు.

రోయర్‌ను ఓడించిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ (ఎడమ)