క్రీడాభూమి

రంజీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ తప్పుకున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే దిశగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించాడు. ఇకముందు ఢిల్లీ రంజీ టీమ్ కెప్టెన్‌గా నితీష్ రాణా వ్యవహరిస్తాడు. యువకులను ప్రోత్సహించాలన్న తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)ను కోరిన దరిమిలా తీసుకున్న నిర్ణయం ముదావహమని అన్నాడు. రంజీ జట్టు కొత్త కెప్టెన్ 24 ఏళ్ల రాణా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాణిస్తూ ఇంతవరకు 24 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించే 26 ఏళ్ల ధృవ్ షోరే ఇంతవరకు 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కాగా, తమ జట్టులోని సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని, అదేవిధంగా కొత్త కెప్టెన్ ఎంపిక కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని డీడీసీఏ ప్రెసిడెంట్ రజత్ శర్మ తెలిపాడు. విజయ్ హజారే ఫైనల్ సమయంలో ఢిల్లీ రంజీ జట్టుకు నాయకత్వం వహించిన గంభీర్ ఈ సీజన్‌లో మొత్తం 500 పరుగులు చేశాడు.