క్రీడాభూమి

130 ఛేదన కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగే రెండో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు వేదిక కానున్న లక్నో స్టేడియంలో ఏ జట్టుకైనా 130కి మంచి స్కోరు చేయడం కష్టసాధ్యమేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా పునర్మించిన ఎకానా స్టేడియం 24 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా టీ-20 మ్యాచ్‌కు ఆతిధ్యం ఇవ్వనుంది. ఇక్కడి పిచ్ మందకొడిగా ఉండడంతో బంతి బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మైదానంలో ఏ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 130 పరుగులు చేస్తే విజయం సాధించినట్టేనని స్థానిక క్యూరేటర్ వ్యాఖ్యానించాడు. ఏ జట్టు అయినా ఇంతకు మించి పరుగులు చేయడం ఈ మైదానంలో అసాధ్యమని స్థానిక క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. స్పిన్నర్లకు ఆట ప్రారంభం నుంచి బాగా కలిసొచ్చే అంశమని వారు అంటున్నారు. ఈ మైదానాన్ని ఒడిషాలోని బొలాన్‌గిర్‌లో ప్రసిద్ధిచెందిన ఒకరకమైన మట్టితో నిర్మించినట్టు క్యూరేటర్ పీటీఐ ప్రతినిధికి తెలిపాడు. ఈ మైదానంలో మంగళవారం భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే రెండో టీ-20లో అత్యధికంగా పరుగులు తీయడం, పెద్ద షాట్‌లు కొట్టడం, లాంగ్ స్క్వేర్ బౌండరీలు బాదడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.