క్రీడాభూమి

మరో సిరీస్‌పై కనే్నసిన టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 5: భారత్‌లో పర్యటిస్తున్న ఆతిధ్య జట్టు వెస్టిండీస్‌తో ఇప్పటికే జరిగిన టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా మరో సిరీస్‌పై కనే్నసింది. ఆదివారం నుంచి ఈ రెండు జట్ల మధ్య టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా టీ-20 సిరీస్‌ను చేజిక్కించుకోవడం ద్వారా ఆతిధ్య జట్టును పూర్తిగా వైట్‌వాష్ చేసే దిశగా పావులు కదుపుతోంది. టీ-20 సిరీస్‌లో ఇరు జట్లలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విండీస్‌తో జరిగే తొలి టీ-20కి విశ్రాంతి ఇచ్చారు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. సీనియర్ ఆటగాడు-వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని టీ-20 సిరీస్‌ల నుంచి తప్పించినా మరికొంతమంది యువకులకు చోటు కల్పించారు. అదేవిధంగా కరేబియన్ల టీమ్‌లో సీనియర్ ఆటగాళ్లు కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రేవో, కీరన్ పొలార్డ్, యువ బౌలర్ ఒషానా థామస్ వంటి వారిని తీసుకున్నా తొలి టీ-20లో ఫలితం వారికి కలసిరాలేదు. అయితే, బ్యాటింగ్‌లో ఈ జట్టు విఫలమైనా బౌలింగ్‌లో భారత్‌ను తత్తరపాటుకు గురిచేసింది. అయినా టీమిండియా తొలి మ్యాచ్‌ను కైవసం చేసుకోవడం ద్వారా మంగళవారం లక్నోలో జరిగే రెండో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించడం ద్వారా సిరీస్‌పై పట్టు బిగించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. బంగ్లాదేశ్‌లో 2014 మార్చి 23న వెస్టిండీస్‌తో జరిగిన వరల్డ్ టీ-20 మ్యాచ్‌లో గెలుపొందిన భారత్ ఇపుడు అదే ప్రత్యర్థిపై కోల్‌కతాలో జరిగిన తొలి టీ-20లో విజయం సాధించింది. వెస్టిండీస్, భారత్ వరల్డ్ టీ-20 సిరీస్‌లలో 5-3 తేడాతో ఉన్నాయి. ఇదిలావుండగా, టీమిండియాకు టీ-20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అదేవిధంగా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, మనీష్ పాండే సైతం ఆకట్టుకోలేకపోయారు.
ప్రత్యర్థి తమ ముందు ఉంచిన పరిమిత లక్ష్యాన్ని (110) ఛేదించడంలో దినేష్ కార్తీక్, జట్టులోకి కొత్తగా వచ్చిన కృణాల్ పాండ్య కృతకృత్యులు కావడంతో 17.5 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది. అయితే, బ్యాటింగ్‌లో ఎడమచేతివాటం బౌలర్ కుల్దీప్ యాదవ్ (3/13) ప్రత్యర్థి జట్టును భయపెట్టాడు. ఇక విండీస్ జట్టులోకి తిరిగి వచ్చిన దిగ్గజ ఆటగాళ్లు కీరన్ పొలార్డ్, డారెన్ బ్రావో వంటివారు సైతం సంతృప్తికరమైన ఆటతీరును కనబరచలేకపోయారు. అయితే, కార్లోస్ బ్రాత్‌వైట్ (2/11), యువ పేసర్ ఒషానే థామస్ (2-21) తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు.