క్రీడాభూమి

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ధావన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ ఏడాదివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఇకముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ ఏడాది జరిగిన వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ధావన్‌ను సన్‌రైజర్స్ కేవలం 5.2 కోట్ల రూపాయలతో జట్టులోకి తీసుకుంది. టీమిండియా టాప్-4 లో ఉన్న తనను అధిక ధరకు రిటైన్ చేయకుండా రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తితో ఉన్న ధావన్ జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఐపీఎల్‌లో నిబంధనల వల్లే ఈ సమస్య పరిష్కారం కాలేదని సన్‌రైజర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభం సందర్భంగా ఢిల్లీ డేల్‌డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శిఖర్ ధావన్ పదేళ్ల తర్వాత మళ్లీ తన సొంత జట్టులో చోటుదక్కించుకున్నాడు. 2013 నుంచి సన్‌రైజర్స్ తరఫున ఆడిన ధావన్ 91 ఇన్నింగ్స్‌లో 2768 పరుగులు చేశాడు. కాగా, శిఖర్ ధావన్‌ను తీసుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ తమ జట్టులోని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, స్పిన్నర్ షాబాజ్ నదీమ్, యువ ఆటగాడు అభిషేక్ శర్మలను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పంపింది. శిఖర్ ధావన్ తమ జట్టులోకి పునరాగమనం చేయడంతో వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి తమకు మంచి రోజులు వచ్చినట్టేనని ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ అభిప్రాయపడ్డాడు.