క్రీడాభూమి

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైల్‌హెట్ (బంగ్లాదేశ్), నవంబర్ 6: జింబాబ్వే-బంగ్లాదేశ్ మధ్య ఇక్కడి నార్త్‌ఈస్టర్న్ సిటీలో మంగళవారం జరిగిన టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతిధ్య జట్టుపై ఐదేళ్ల తర్వాత, 2001 తర్వాత 17 మళ్లీ ఇపుడు ఈ విజయాన్ని నమోదు చేయడంతో జింబాబ్వే ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెస్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న జింబాబ్వే లెగ్‌స్పిన్నర్ మవుతా 21 పరుగులిచ్చి 4 వికెట్లు, ఆఫ్‌స్పిన్నర్ రజా 41 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆతిధ్య జట్టు వెన్నువిరిచారు. పర్యాటక జింబాబ్వే జట్టు తమ ముందు ఉంచిన 321 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ విఫలమై 169 పరుగులకే ఆలౌటైంది. కాగా, బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు సాధించిన అద్భుత గెలుపు తనకు దీపావళి గిఫ్టు వంటిదని ఆ జట్టు ప్రధాన కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నాడు.