క్రీడాభూమి

దక్షిణాసియా క్రీడల మస్కట్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 13: ఈశాన్య నగరాలు గౌహతి, షిల్లాంగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16వ తేదీ వరకూ ఆతిథ్యమిచ్చే 12వ దక్షిణాసియా క్రీడల లోగో, మస్కట్‌ను నిర్వాహణ కమిటీ (ఒసి-ఎస్‌ఎజి) ఆదివారం విడుదల చేసింది. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్శానంద సోనోవాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎనిమిది దేశాలకు చెందిన సుమారు 4,500 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారని అంచనా. పోటీల సందర్భంగా వలంటీర్లుగా వ్యవహరించే వారి పేర్ల నమోదు కార్యక్రమం కూడా ఆదివారం మొదలైంది. ‘తికోర్’గా నామకరణం చేసిన ఖడ్గమృగం పిల్ల మస్కట్ విడుదల సందర్భంగా సోనోవాల్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక మేజర్ ఈవెంట్ జరగనుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నదని అన్నారు. మస్కట్ తికోర్ కేవలం బలానికేగాక, ఈశాన్య రాష్ట్రాల శక్తిసామర్థ్యాలు, ప్రతిభాపాటవాలకు కూడా నిదర్శమని వ్యాఖ్యానించారు.
chitram..
గౌహతిలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో దక్షిణాసియా క్రీడల మస్కట్ తికోర్‌ను ఆవిష్కరిస్తున్న
అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్, కేంద్ర క్రీడల మంత్రి శర్వానంద సోనోవాల్.