క్రీడాభూమి

చైనా ఓపెన్ బాడ్మింటన్ విజేత మొమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘ్‌హై, నవంబర్ 11: బాడ్మింటన్ వరల్డ్ చాంపియన్, జపాన్ షట్లర్ కెంటో మొమోటా ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన చైనా ఓపెన్ పైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ మొమోటా తైవాన్‌కు చెందిన నాలుగో సీడ్ ఆటగాడు చౌ తియెన్ చెన్‌ను 21-13, 11-21, 21-16 తేడాతో ఓడించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. దాదాపు 66 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో 24 మొమోటా తొలిమ్యాచ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించినా రెండో మ్యాచ్‌లో ఓడిపోయాడు. అయితే, గెలుపునకు కీలకమైన మూడో మ్యాచ్‌లో సత్తా చాటి విజయతీరాలకు చేరుకున్నాడు. మొమోటా ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌తోపాటు ఆసియా చాంపియన్‌షిప్‌తోపాటు నాలుగు వరల్డ్ టూర్ ఈవెంట్లలో ఘనవిజయం సాధించాడు. చైనా ఓపెన్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న మొమోటా ఇపుడు హాంకాంగ్ ఓపెన్‌పై దృష్టి సారించాడు. తొలిమ్యాచ్‌లో వరల్డ్ మాజీ నెంబర్ వన్, చైనా ఆటగాడు లిన్ డాన్‌తో మొమోటా తలపడతాడు.