క్రీడాభూమి

సాహానే ఉత్తమ కీపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: భుజం గాయం కారణంగా టీమిండియాలో ప్రస్తుతం చోటుదక్కని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా గత ఐదు, పదేళ్లుగా ఉత్తమ కీపర్‌గా రాణిస్తున్నాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. సీనియర్ జర్నలిస్టు గౌతం భట్టాచార్య రాసిన క్రీడా కాల్పనిక సాహిత్య పుస్తకం ‘వికీ’ ఆవిష్కరణ ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ మహేంద్ర సింగ్ ధోనీ 2014 డిసెంబర్‌లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అంతటి సత్తా కలిగిన వికెట్ కీపర్‌గా 34 ఏళ్ల సాహా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. భుజంనొప్పికి శస్తచ్రికిత్స జరిగిన తర్వాత గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న సాహా ప్రస్తుతం టీమిండియాలో లేకున్నా గత ఐదు, పదేళ్లుగా భారత్‌కు లభించిన గొప్ప వికెట్ కీపర్ అని గంగూలీ నొక్కిచెప్పాడు. ‘ఆటలో గాయాలబారిన పడడం మన చేతుల్లో ఏమీ లేదు. వికెట్ కీపర్ డైవ్ చేస్తుండాలి, అందులోనే అతను గాయపడ్డాడు. కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. సాహా త్వరగా కోలుకోవాలని అభిలషిస్తున్నాను’ అని గంగూలీ అన్నాడు. వృద్ధిమాన్ సాహా టీమిండియా తరఫున ఇంతవరకు ఆడిన 32 టెస్టుల్లో 1164 పరుగులు చేయగా, ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో గాయపడడంతో సిరీస్ నుంచే వైదొలగాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జూలైలో ఆస్ట్రేలియా టూర్‌లో సైతం సాహా ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది.
రంజీలో ఆడతా:సాహా
భుజం గాయం కారణంగా శస్తచ్రికిత్స జరిగి గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మళ్లీ ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జూలైలో భుజానికి శస్తచ్రికిత్స జరిగిన తర్వాత తీసుకుంటున్న విశ్రాంతి వల్ల ప్రస్తుతం బాగా కోలుకుంటున్నానని అన్నాడు. సీనియర్ జర్నలిస్టు గౌతమ్ భట్టాచార్య రాసిన ‘వికీ’ పుస్తకావిష్కరణలో సాహా మాట్లాడుతూ వచ్చేనెలలో జరిగే రంజీ ట్రోఫీలో ఆడేందుకు తగిన శిక్షణ తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ‘్ఫట్నెస్‌పరంగా బాగా కోలుకున్నాను. ఇప్పుడిప్పుడే నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. రానున్న రంజీ ట్రోఫీలో ఆడగలననే గట్టి నమ్మకం ఏర్పడింది’ అని అన్నాడు. ఇదిలావుండగా, ఈ ఏడాది వృద్ధిమాన్ సాహాకు ఏమాత్రం కలసిరాలేదు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన తొలిటెస్టులో టీమిండియాలో ఆడిన సాహా గాయపడడంతో ఆ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు సైతం దూరమయ్యాడు. అదేవిధంగా ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేతివేలికి గాయం కారణంగా జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత భుజంనొప్పి తీవ్రంగా వేధించడంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో శస్తచ్రికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లలో సైతం చోటు దక్కకపోవడంతో రిషబ్ పంత్, పృథ్వీ పాటిల్‌ను జట్టులోకి తీసున్నారు. సమీప భవిష్యత్తులో టెస్టు సిరీస్‌లో స్థానం దక్కే అవకాశం లేకపోవడంతో సాహా ఇపుడు దేశవాళీ టోర్నీలపై దృష్టి సారించాడు. ‘ప్రతిఒక్కరికీ ఒడిదుడులు ఉంటాయి. అయితే, దేశవాళీ టోర్నీల్లో రాణిస్తేనే జాతీయ జట్టులో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎంపికయ్యేవరకూ వేచి చూడాలి. ఫిట్నెస్‌పరంగా సిద్ధంగా ఉండాలి’ అని వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు.

చిత్రం..టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ