క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్‌పై సింధు కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్ (హాంకాంగ్), నవంబర్ 12: భారత షట్లర్ పీవీ సింధు మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభమయ్యే హాంకాంగ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ టోర్నమెంట్‌పై కనే్నసింది. గత సీజన్‌లో ఇదే టోర్నమెంట్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో పరాజయం పాలై, సెకండ్ బెస్ట్‌గా నిలిచిన సింధు మరోసారి ఇదే ప్రత్యర్థితో తలపడనుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కీ వినె్సంట్‌తో తలపడనున్నాడు. మరోపక్క భారత్‌కు చెందిన మరో షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ తొలిరౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ ఆంథోన్‌సెన్‌తో పోటీపడతాడు. అదేవిధంగా ఈ సీజన్‌లో స్విస్ ఓపెన్, హైదరాబాద్ ఓపెన్ విజేత సమీర్ వర్మ తొలిరౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన సుపన్యు అవిహింగ్సనన్‌తో తలపడతాడు. గత ఏడాది సింగపూర్ ఓపెన్ విజేత బి.సాయిప్రణీత్ తన తొలిరౌండ్‌లో థాయ్‌కి చెందిన ఖోసిత్ ఫెట్‌ప్రదబ్‌తో పోటీపడతాడు. పురుషుల డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న సాత్విక్‌రాజ్-రంకిరెడ్డి తొలిమ్యాచ్‌లో ప్రపంచ మాజీ నెంబర్ వన్, లండన్ ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత జోడీ మథియాస్ బోయె-కార్‌స్టెన్ మొగన్‌సెన్‌ను ఎదుర్కోనున్నారు. మనుఅత్రి, బి.సుమీత్‌రెడ్డి థాయిలాండ్ జోడీ బొదిన్ ఇల్‌సారా, మనీపాంగ్ జొంగ్‌జిత్‌తో తొలిరౌండ్‌లో తలపడనున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ఎన్.సిక్కిరెడ్డి రెండోసీడ్, జపాన్ జోడీ మిసాకీ మత్సుటొమో, అయాకా తకహసిలను ప్రారంభ రౌండ్‌లో ఎదుర్కోనున్నారు.