క్రీడాభూమి

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ 23వ స్థానంలో కుల్దీప్ యాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 12: వెస్టిండీస్‌తో స్వదేశంలో ఇటీవల జరిగిన వివిధ సిరీస్‌లలో కీలకపాత్రను పోషించిన టీమిండియా చైనామన్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ సోమవారం తాజాగా ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 14 స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో కుల్దీప్ యాదవ్ 5.6 ఎకానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. భారత ఫాస్ట్‌బౌలర్ భువనేశ్వర్ కుమార్ 9 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్‌తో టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 5 స్థానాలు మెరుగుపరచుకుని 21వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా టీ-20ల్లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం బ్యాటింగ్‌లో తమ ర్యాంకులను మరింత మెరుగుపరచుకున్నారు. రోహిత్ శర్మ 3 స్థానాలు ఎగబాకి ప్రపంచ ర్యాంకింగ్‌లో 7వ స్థానం, శిఖర్ ధావన్ 5 స్థానాలు మెరుగుపరచుకుని 16వ స్థానంలో చోటుదక్కించుకున్నారు. కాగా, టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ 138 పాయింట్లతో మొదటి స్థానం, 127 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.
చిత్రం..కుల్దీప్ యాదవ్