క్రీడాభూమి

ధావన్ మళ్లీ ఫాంలోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ మళ్లీ ఫాంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ మూడు టీ-20 సిరీస్‌లలో ఆడనున్న నేపథ్యంలో ధావన్ మళ్లీ తన మునుపటి ఆటతీరును కనబరచాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ టూర్ భారత్‌కు అత్యంత కీలకం, పూర్తి భిన్నంగా జరిగే బాల్ గేమ్ వంటిదని అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వనే్డ సిరీస్ నుంచి ఆశించిన రీతిలో ఆడలేకపోతున్న ధావన్ ఆదివారం చెన్నైలో అదే జట్టుతో జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో 62 బంతులు ఎదుర్కొని 92 పరుగులు చేసిన విషయాన్ని రోహిత్ ప్రస్తావించాడు. టీ-20 సిరీస్‌ను టీమిండియా 6 వికెట్ల తేడాతో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌తోపాటు యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 25 బంతులు ఎదుర్కొని 52 పరుగులు చేసి 3-0తో చాంపియన్‌షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. ఇదే ఆటతీరును ఆసిస్ టూర్‌లోనూ కనబరిచేందుకు పరుగులు తీసే బ్యాట్స్‌మెన్‌ల అవసరం ఎంతో ఉందని అన్నాడు. విండీస్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో ఆడిన కొత్త బ్యాట్స్‌మన్ కృణాల్ పాండ్య ఆటతీరును తనను ఎంతో ఆకట్టుకుందని, తన తెలివితేటలతో చాలాకాలం ఆడే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో జరిగే టీ-20 సిరీస్‌లో సైతం భారత్ గెలుపు అవకాశాలను మెరుగుపరచుకునేందుకు తాజాగా జరిగిన విండీస్‌పై టీ-20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం కలిసొస్తుందనే గట్టి నమ్మకం, బలమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్‌ల కంటే ముందు ఆసిస్‌తో జరిగే టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతోపాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లు తమకు బాగా ఉపకరిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ధోనీ లేకపోవడం వెలితిగా ఉంది
వెస్టిండీస్‌తో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌తోపాటు ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 సిరీస్‌కు తమ జట్టులోని సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం ఎవరూ పూడ్చలేనిదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. విండీస్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సందర్భంగా ధోనీ లేని లోటు స్పష్టంగా కనబడిందని అన్నాడు. శ్రీలంకలో ఇటీవల జరిగిన నిదహాస్ ట్రోఫీలో సైతం ధోనీ లేని విషయాన్ని రోహిత్ ప్రస్తావిస్తూ టీమిండియా క్రికెటర్లలో తనతోపాటు యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించే మాజీ కెప్టెన్ లాంటి ఆటగాడు ఏ టీమ్‌లో లేకున్నా ఏదో వెలితిగా ఉంటుందన్నాడు.
చిత్రం..రోహిత్ శర్మ