క్రీడాభూమి

‘భరత్‌పై అత్యధిక స్కోరు సాధిస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 13: భారత్‌తో మరికొద్దిరోజుల్లో తలపడే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాము అత్యధిక స్కోరు సాధిస్తామని న్యూజిలాండ్ యువ స్పిన్నర్ మిచెల్ సంత్‌నెర్ అన్నాడు. స్వదేశంలోని మైదానం, వికెట్లు, సిరీస్‌పై తాము పెంచుకున్న ఆశలు తమకు కలిసొస్తాయనే బలమైన నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించాడు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ప్రసార హక్కులను పొందిన స్టార్ స్పోర్ట్స్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. భారత్‌తో తాము మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో తలపడతామని, ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 23 నుంచి ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనున్నామని అన్నాడు. 2014-15 తర్వాత టీమిండియా మళ్లీ ఇపుడు తమ దేశంలో పర్యటించనుందని, అప్పటికీ, ఇప్పటికీ ఇరు జట్లలో ఎన్నో రకాల మార్పులు, చేర్పులు జరిగాయని అన్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత్ అద్భుతంగా రాణించిందని, కానీ తమ దేశంలోని వాతావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని, ఇవి తమకు బాగా ఉపకరిస్తాయనే గట్టి నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు పలువురు క్రికెటర్లు పరుగుల వరద పారించే సత్తా ఉన్నవారని, కానీ వారంతా గత నాలుగేళ్లుగా తమ దేశంలో ఆడిన దాఖలాలు లేవని అన్నాడు. ఈ క్రికెటర్లంతా ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన ఎన్నో దేశాల్లో అత్యధికంగా పరుగులు సాధించి ఉండవచ్చునని, తమ దేశంలో కూడా అదే ఆటతీరును కనబరుస్తామని వారు బలంగా నమ్ముతుండవచ్చునని అన్నాడు.