క్రీడాభూమి

న్యూజిలాండ్ టూర్... రోహిత్ శర్మకు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: ఈనెల 21నుంచి న్యూజిలాండ్‌లో జరుగనున్న మూడు టీ-20ల సిరీస్‌లో పాల్గొనే భారత-ఏ జట్టు నుంచి రోహిత్ శర్మ ఆడేందుకు అవకాశం లేదు. ఇటీవల కాలంలో అవిశ్రాంతంగా ఆడుతున్న రోహిత్‌పై వర్క్ లోడ్ అధికంగా పడడంతో అతనిని న్యూజిలాండ్ టూర్ నుంచి విశ్రాంతి కల్పించారు. అయితే, న్యూజిలాండ్‌తో టీ-20 సిరీస్‌లో ఆడకపోయినా ఆ తర్వాత అదే టీమ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో మాత్రం రోహిత్ ఆడతాడు. రోహిత్‌పై పడిన అదనపు భారంతోపాటు అతను ఆ తర్వాత జరిగే కీలక టెస్టులో ఆడేందుకు వీలుగా బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదించిన తర్వాతే టీమ్ మేనేజిమెంట్, ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. రోహిత్‌పై పడిన అదనపు భారాన్ని తగ్గించేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.