క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్.... క్వాలిఫయంగ్ రౌండ్‌లో కశ్యప్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్, నవంబర్ 13: హాంకాంగ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్‌లో కామనె్వల్త్ గేమ్స్ మాజీ చాంపియన్, మాజీ వరల్డ్ నెంబర్-6 పారుపల్లి కశ్యప్ శుభారంభం అందించాడు. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన ఈ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో కశ్యప్ చైనా తైపీ క్రీడాకారుడు షు జెన్ హావోపై 21-7, 12-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. గత కొనే్నళ్లుగా గాయాలబారిన పడుతున్న కశ్యప్ హాంకాంగ్ ఓపెన్‌లో గంట మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. మెయిన్ డ్రాలో ఇండోనేషియా షట్లర్, ఏడో సీడ్ ఆంధోనీ సినిసుకా జింటింగ్‌తో కశ్యప్ తలపడతాడు. ఇదిలావుండగా, ఇదే టోర్నీలోని మిక్సిడ్ డబుల్స్ ఓపెనింగ్ రౌండ్ మెయిన్ డ్రాలో సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి-అశ్విని పొన్నప్ప చైనీస్ తైపీ జోడీ వాంగ్ చి లిన్-లీ చియా సిన్‌లపై 21-16, 19-21, 21-14 తేడాతో విజయం సాధించారు. ఈ భారత జోడీ తమ తదుపరి రౌండ్‌లో తైవాన్ జోడీ లీ యాంగ్- యా చింగ్‌తో తలపడతారు.