క్రీడాభూమి

ఐసీసీ వనే్డ ర్యాంకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 13: ఐసీసీ మంగళవారం ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా యథాతథంగా తమ అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 899 పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలవగా, పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో చోటుదక్కించుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మతో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ 9 స్థానాలు మెరుగుపరచుకుని ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 20వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బౌలర్లలో ముగ్గురు భారత బౌలర్లు చోటుదక్కించుకోగా వారిలో జస్ప్రీత్ బుమ్రా 841 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐదవ స్థానంలో చోటుదక్కించుకున్నాడు. కాగా, వరల్డ్ క్రికెట్‌లో వనే్డ ఆల్‌రౌండర్, అఫ్గనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ 353 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ 126 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 121 పాయింట్ల ఆ తర్వాత స్థానంలో నిలిచింది.