క్రీడాభూమి

మహిళల టీ-20 వరల్డ్ కప్ సెమీస్‌పై హర్మన్‌ప్రీత్ సేన గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుయానా, నవంబర్ 14: ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20 ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ ఇపుడు సెమీఫైనల్స్‌లో బెర్త్ ఖాయం చేసుకునే దిశగా పోరాడేందుకు సిద్ధమైంది. గ్రూప్-బీ మ్యాచ్‌లో పోటీపడుతున్న భారత్ ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లోనూ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం మూడో టీ-20లో ఐర్లాండ్‌తో తలపడనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత గెలుపుతో రాణించిన వేదికపైనే గురువారంనాడు మూడో మ్యాచ్‌లోనూ భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని తాము తక్కువగా అంచనా వేయబోమని ప్రకటించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, గట్టి పోటీ ఇవ్వడం ద్వారా పైచేయి సాధించి తద్వారా సెమీఫైనల్స్‌లో తప్పకుండా చోటు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ సెంచరీ నమోదు చేసి జట్టును గెలిపించే కీలక బాధ్యతలను నిర్వర్తించగా, రెండో మ్యాచ్‌లో మిథాలీరాజ్ తన అద్భుత ప్రతిభతో రాణించడంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో కౌర్ సేన ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగే మూడో టీ-20లో స్మృతి మంధానతోపాటు వేదా కృష్ణమూర్తి అత్యధిక స్కోరు చేయగలరని, బౌలర్లలో దయాలన్ హేమలత, లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ వంటివారు ప్రత్యర్థి పరుగుల వరద పారించకుండా కట్టడి చేయగలరనే గట్టి నమ్మకాన్ని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యక్తం చేసింది.