క్రీడాభూమి

ఊపిరితిత్తుల్లో రక్తస్రావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 14: ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కారణంగా ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉండడంతో ఏకంగా క్రికెట్ నుంచే తప్పుకోవాలని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, ఆల్‌రౌండర్ జాన్ హేస్టింగ్స్ (33) నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ విచిత్ర సమస్య మరింత వేధిస్తున్నందువల్ల ఈ ఆకస్మిక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు వెల్లడించాడు. ఆసిస్ తరఫున మూడు ఫార్మాట్లలోని గేమ్‌లలోనూ ప్రాతినిధ్యం వహించిన హేస్టింగ్స్ గతనెలలో ఒక మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో రక్తస్రావం అయింది. చాలా కాలం కిందటే ఈ తీవ్రతను గుర్తించి తగిన టెస్టులతోపాటు శస్తచ్రికిత్స కూడా చేయించుకున్నాడు. అయినా ఆ తర్వాత ఏ మ్యాచ్‌లో బౌలింగ్ చేసినా ఊపిరితిత్తుల్లో రక్తస్రావం రానురాను ఎక్కువవుతున్నట్టు గమనించాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైనా దానికోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టలేనని అంటూ పూర్తిగా క్రికెట్ నుంచే తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించాడు. హేస్టింగ్స్ ఆసిస్ తరఫున ఒక టెస్టు మ్యాచ్, 9 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 29 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. వచ్చేనెలలో ఆస్ట్రేలియా తరఫున ట్వంటీ ట్వంటీ బిగ్‌బాస్ లీగ్‌లో ఆడేందుకు నిర్ణయించాడు. అయితే, ప్రస్తుతం తన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో పూర్తిగా కోలుకుంటే ఈ లీగ్‌లో ఆడతానని పేర్కొన్నాడు.