క్రీడాభూమి

విండీస్ టెస్టుకు బంగ్లా షకీబ్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, నవంబర్ 17: వెస్టిండీస్‌తో ఈనెల 22 నుంచి చిట్టగాంగ్‌లో జరిగే తొలి టెస్టుమ్యాచ్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను సిద్ధమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చేతి వేలికి తగిలిన గాయం కారణంగా ఇప్పటివరకు ఆటకు దూరంగా ఉన్న షకీబ్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్‌తో బరిలోకి దిగనున్నాడని జట్టు యాజమాన్యం పేర్కొంది. జింబాబ్వేతో ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడని బంగ్లాదేశ్ చీఫ్ సెలెక్టర్ మినుహ్‌జాల్ అబేదిన్ పేర్కొన్నాడు. కెప్టెన్, ఆల్‌రౌండర్ అయిన షకీబ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, విండీస్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో ఆడతాడని స్పష్టం చేశాడు.