క్రీడాభూమి

15-17 ఓవర్లే వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 17: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కేరళతో త్వరలో జరిగే రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో కేవలం 15-17 ఓవర్లు మాత్రమే ఆడాలని బీసీసీఐ పరిమితి విధించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించే జట్టులో చోటు దక్కించుకున్న షమీపై అదనపు భారం పడకుండా ఆ టెస్టు సిరీస్‌ను ఉద్దేశించి బీసీసీఐ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన తొలి రెండు వనే్డలకు షమీ ఫిట్నెస్‌ను దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి ఇచ్చారు. బెంగాల్‌కు చెందిన పేసర్ షమీ భారత్ తరఫున ఈ ఏడాది ఆడిన వివిధ మ్యాచ్‌లలో 33 వికెట్లు తీసుకున్నాడు.