క్రీడాభూమి

భారత్‌నే వేలెత్తి చూపిస్తారెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్‌బేన్, నవంబర్ 18: విదేశాల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయిందని అంటూ ఒక్క భారత్‌నే ఎందుకు వేలెత్తి చూపిస్తారని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ ప్రశ్నించాడు. గత ఐదేళ్ల కాలంలో విదేశాల్లో జరిగిన మ్యాచ్‌లలో ఇంతవరకు ఏ జట్టు దుమ్ము రేపిందని, అద్భుతంగా రాణించిందో ఎవరైనా చెప్పగలరా? అంటూ టీమిండియాపై విమర్శలు చేస్తున్న వారిని ప్రశ్నించాడు. భారత్ ఈ ఏడాది ఇంతవరకు విదేశాల్లో రెండు టెస్టు సిరీస్‌లలో ఆడింది. దక్షిణాఫ్రికాపై 1-2 తేడాతో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకుంది. అదేవిధంగా ఇంగ్లాండ్ టూర్‌లో 1-4 తేడాతో ఘోరంగా ఓటమిని మూటకట్టుకుంది. విదేశాల్లో జరిగిన ఈ రెండు టెస్టు సిరీస్‌లలో ఓడిపోయినంత మాత్రాన టీమిండియాను వేలెత్తి చూపిస్తూ నిందలు వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాడు. ఇపుడు ఆస్ట్రేలియాలో రెండు నెలలపాటు భారత్ పర్యటించనున్న నేపథ్యంలో 3 టీ-20 మ్యాచ్‌లు, 4 టెస్టు మ్యాచ్‌లతోపాటు వచ్చే ఏడాది ప్రథమార్థంలో 3 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టూర్‌లతోపాటు నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా టూర్‌లో ఎదురైన ఎదురైన అనుభవాల నుంచి ఎన్నో నేర్చుకున్నామని రవిశాస్ర్తీ పేర్కొన్నాడు. 1990 దశకంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బాగా రాణించాయని, కానీ గత ఐదారేళ్లుగా విదేశాల్లో పర్యటించిన ఏ జట్టు కూడా ఆశించిన ప్రతిభను కనబరచలేకపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చునని, వాటిని గమనంలోకి తీసుకుని మళ్లీ అలాంటి పొరపాట్లు జరిగేందుకు ఆస్కారం లేకుండా తగిన జాగురూకతతో వ్యవహరిస్తామని అన్నాడు. ఇటీవల కాలంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఆసిస్ జట్టును ఒక కుదుపు కుదిపిన నేపథ్యంలో ఇపుడు ఫిక్సింగ్ ప్రభావం ఆ జట్టుపై ఎంతవరకు చూపిస్తుందో చెప్పలేమని అన్నాడు. అయితే, స్వదేశంలో ఆడే ఏ జట్టు అయినా అంత బలహీనంగా ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నాడు. క్రీడాస్ఫూర్తికి విఘాతం కలుగకుండా పయనించే ఏ జట్టు అయినా ముందుకు సాగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పిచ్‌పై తమ పేసర్లు అద్భుతంగా రాణిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నాడు.
కోహ్లీ ఎంతో పరిణతి సాధించాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంతో పోల్చుకుంటే ఇపుడు ఎంతో పరిణతి సాధించాడని, ఉద్వేగం తెచ్చుకోకుండా ఆడగలడని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ అన్నాడు. 2014-15 నుంచి ఇప్పటివరకు కోహ్లీ ఆటతీరును గమనిస్తే అతనిలో ఎంతో అద్భుత ప్రతిభ కనబడుతోందని, మ్యాచ్‌లో కీలక సమయాల్లో సారధిగా జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడని అన్నాడు. జట్టును సమన్వయంతో, సమర్థవంతంగా, సమష్టిగా నడిపించే తపన కోహ్లీలో ఎక్కువగా కనపడుతోందని పేర్కొన్నాడు. ఆసిస్ గడ్డపై కోహ్లీ 2011-12 మధ్యకాలంలో ఆడిన మ్యాచ్‌లలో 1 సెంచరీ చేశాడని, 2014-15 మధ్యకాలంలో 4 శతకాలు నమోదు చేశాడని అన్నాడు. వాస్తవానికి ఆస్ట్రేలియా మైదానంపై ఆడేందుకు కోహ్లీ ఎక్కువగా ఇష్టపడతాడని, ఇక్కడి పిచ్‌లు అతని బ్యాటింగ్ సరళికి అనుకూలంగా ఉంటాయని అన్నాడు.
పంకజ్ ఖాతాలో
మరో ప్రపంచ టైటిల్
యాంగాన్ (మయన్మార్), నవంబర్ 18: భారత దిగ్గజ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ ఆదివారం జరిగిన ఐబీఎస్‌ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో మరో టైటిల్ అందుకున్నాడు. ఈ టైటిల్ అందుకోవడం ఇది నాలుగోసారి కాగా, పంకజ్ ఖాతాలో 21 టైటిళ్లు జమ అయ్యాయి.