క్రీడాభూమి

ఆసిస్ బౌలర్లను ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్‌బేన్, నవంబర్ 19: ఆస్ట్రేలియాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆ దేశ పొడగరి బౌలర్లను తాము సమర్ధవంతంగా ఎదుర్కొంటామని టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ఆసిస్ పిచ్‌లపై భారత ఆటగాళ్లు రాణించలేరనే వాదనను కొట్టేస్తూ మూడు సిరీస్‌లలో తాము కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని పేర్కొన్నాడు. 3 టీ-20 మ్యాచ్‌లతోపాటు డిసెంబర్ 14 నుంచి 18 మధ్య కాలంలో జరిగే రెండో టెస్టు పెర్త్ లేదా బ్రిస్‌బేన్ వేదికగా టీమిండియా ప్రత్యర్థితో తలపడుతుందని అన్నాడు. ఈ రెండు మైదానాల్లో పరిస్థితులు తమకు చాలెంజ్‌తో కూడుకున్నాయని, అయినా సొంత గడ్డపై పిచ్‌లు తమకు అనుకూలంగా మారుతాయని ఆతిధ్య జట్టు అంచనాలతో ఉండొచ్చని పేర్కొన్నాడు. ‘్భరత బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆసిస్ ఆటగాళ్లలా పొడగరి కాదు. ఆసిస్ పేసర్లను ఎదుర్కోవడం మాకు అంత సులువు కాదు. కానీ తామంతా చాలెంజ్‌ను స్వీకరిస్తున్నాం. ఆ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే తమ జట్టులోని చాలామంది ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నారని, ఇక్కడి వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నారని అన్నాడు. ప్రత్యర్థి బౌలింగ్ దాడిని ఎదుర్కొనేందుకు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాట్‌లను ఝళిపించేందుకు తమ కుర్రాళ్లు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. కేవలం టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లే కాకుండా ఆ తర్వాత ఇదే ప్రత్యర్థితో తలపడే 4 టెస్టు సిరీస్‌లు, 3 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలోనూ తాము సమష్టిగా రాణించగలమనే గట్టి నమ్మకం ఉందని రోహిత్ అన్నాడు. ఇదిలావుండగా, టీమిండియా ఇంతవరకు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెల్చుకోలేకపోయింది. భారత్ ఆడిన 11 టెస్టుల్లో 3 డ్రా కాగా, 8 టెస్టుల్లో ఓటమిని చవిచూసింది. టీమిండియా విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ఒక ప్రత్యేకత అనుభవం కలుగుతుందని అన్నాడు. సిరీస్‌లు పూర్తయ్యాక మళ్లీ స్వదేశానికి వెళ్లేలోగా తమ సత్తా ఏమిటో నిరూపించుకుంటామని అన్నాడు. విదేశీ మైదానంపై చూపిన ప్రతిభా సామర్థ్యాలతో వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో భారీ ఎత్తున నిర్వహించే వరల్డ్ కప్‌లో మరింత అద్భుతంగా రాణించేందుకు ఆస్కారం ఉంటుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని, ముఖ్యంగా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే స్పిన్నర్లు ఉండడం తమకు కలిసొచ్చే అంశమని వ్యాఖ్యానించాడు. అదేవిధంగా బ్యాటింగ్ లైనప్‌లోనూ తాము అద్భుతంగా రాణిస్తున్నామని, విదేశీ గడ్డపై తాము ఏవిధంగా ఆడతామో ప్రతిఒక్కరూ చూడాలని కోరాడు. ఇదిలావుండగా, ఆసిస్ గడ్డపై రోహిత్ శర్మ ఇంతవరకు ఆడిన 16 మ్యాచ్‌లలో 805 పరుగులు చేశాడు. మళ్లీ ఇదే మైదానంపై వైట్‌బాల్ క్రికెట్ ఆడేందుకు మంచి రోజు వచ్చిందని అన్నాడు.
హిట్‌మ్యాన్ దూకుడును అడ్డుకోవాలి
ఆసిస్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్
తమ దేశంలో దాదాపురెండు నెలలు పర్యటించనున్న ఆతిధ్య టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎన్నో రికార్డులను చెరిపివేస్తున్న ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆసిస్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ అన్నాడు. భారత్ టీమ్‌లో కెప్టెన్ కోహ్లీ తర్వాత అంతటి ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను పరుగుల వరద పారించే సత్తా ఉన్నవాడని గబ్బా మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. ఈనెల 21నుంచి తలపడే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ తమకు కొరకరాని కొయ్యగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నాడు. ‘రోహిత్ అద్భుతమైన, నమ్మదగని ఆటగాడు. అతని రికార్డులే ఇవి చెబుతాయి.