క్రీడాభూమి

గీత దాటం...ప్రత్యర్థి దాటితే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్‌బేన్, నవంబర్ 20: ఆస్ట్రేలియాలో తమ రెండు నెలల టూర్‌లో ఆడే టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, టెస్టు సిరీస్‌లు, వనే్డ సిరీస్‌లలో తాము హద్దులు దాటి ప్రవర్తించబోమని, అదే సమయంలో ప్రత్యర్థి గీత దాటితే ఊరుకోమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆసిస్ టూర్‌లో భాగంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్ బుధవారం ఇక్కడి గబ్బా స్టేడియంలో జరుగనుంది. దూకుడు అనేది మైదానంలోని పరిస్థితులను బట్టి ఉంటుందని, ప్రత్యర్థి అనుసరించే వ్యూహాలకు అనుగుణంగా తమ సహజమైన దూకుడును ప్రదర్శిస్తామని స్పష్టం చేశాడు. తమ ఆత్మగౌరవానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ఆ హద్దుకు భంగం కలిగించేవారి ఆట కట్టించేందుకు తాము సంసిద్ధంగా ఉంటామని అన్నాడు. మైదానంలో బౌలర్ సామర్ధ్యానికి అనుగుణంగా బ్యాటింగ్‌లో మార్పులు చేసుకుంటాయని, అదే సమయంలో దూకుడు పెరుగుతుందని, ఇదంతా కాకతాళీయంగా జరుగుతుందని పేర్కొన్నాడు. ప్రతి ఆటగాడికి ఒక్కో స్టయిల్ ఉంటుందని అంటూ తన విషయానికి వస్తే బరిలోకి దిగిన తర్వాత జట్టు గెలుపు కోసం శతధా ప్రయత్నిస్తానని, అదే సమయంలో టీమ్‌నంతా సమష్టిగా ముందుకు తీసుకెళ్లేందుకు 120 శాతం ప్రయత్నిస్తానని అన్నాడు. ఇదిలావుండగా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌తోపాటు మరో క్రికెటర్‌పై విధించిన నిషేధాన్ని తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెట్ యోచిస్తున్న విషయాన్ని కోహ్లీ ప్రస్తావిస్తూ ‘చూద్దాం..అసలేం జరుగుతుందో.. కామెంట్ చేయడానికి నా స్వంత దేశం కాదు’ అని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో నిషేధం ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు క్రికెటర్లు లేనంతమాత్రాన ప్రస్తుత సిరీస్‌లో ఆ ప్రభావం ఉండకపోవచ్చునని అన్నాడు. అయితే, ఆతిధ్య జట్టు కంటే తాము ఏరకంగా చూసుకున్నా బలంగా ఉన్నామని, ఇందువల్లే ఉత్తమంగా రాణించగలమనే గట్టి నమ్మకం, బలమైన విశ్వాసం ఉన్నాయని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వాతావరణ పరిస్థితుల గురించి మాట్లాడుతూ పిచ్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని, అయినా అన్ని సిరీస్‌లలోనూ ఆసిస్‌కు గట్టి పోటీ ఇస్తామని అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమ జట్టు మంచి ఫామ్‌లో ఉందని, ఇపుడు విదేశీ గడ్డపై దానిని అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నాడు. తమ జట్టులో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారని, ఇదే దూకుడుతో వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో నిర్వహించే వరల్డ్ కప్‌లోగా తాము ఆడే అన్ని పరిమిత ఫార్మాట్లలోనూ వారు తమ సహజమైన ఆటతీరును ప్రదర్శిస్తారనే గట్టి నమ్మకం తనకు ఉన్నాయని అన్నాడు.
ఆ పొరపాట్లు మళ్లీ దొర్లనివ్వం
ఈ ఏడాది ప్రథమార్థంలో ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో జరిగిన పొరపాట్లను ఇపుడు తమ ఆస్ట్రేలియా టూర్‌లో దొర్లనివ్వబోమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 1-4తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి అడెలైడ్‌లో ఆసిస్‌తో టెస్టు మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో బ్రిటీష్ గడ్డపై దొర్లిన పొరపాట్లు, తప్పులు తెలుసుకున్నామని, మళ్లీ అవే పునరావృతం కాకుండా తగిన జాగురూకతతో వ్యవహరిస్తామని అన్నాడు. ఇంగ్లాండ్ టూర్‌లో సైతం తాము సమర్థవంతంగా రాణించామని, కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆసిస్‌తో జరిగే అన్ని సిరీస్‌లలోనూ ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించేందుకు, తద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా ముందుకు వెళ్తామని కోహ్లీ అన్నాడు. ఇదిలావుండగా, టీమిండియాతో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఆడే తమ టీమ్‌లో దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటివారు లేకున్నా తమదే పైచేయి అవుతుందని ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ సేన బలమైనదేనైనా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తాము సమర్ధవంతంగా రాణించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని అన్నాడు. టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ బలమైనదేనైనా దూకుడుతో వారికి అడ్డుకట్ట వేస్తామని అన్నాడు. ప్రస్తుత సీజన్‌లో భారత్‌తో తలపడే టీ-20, టెస్టు, వనే్డ సిరీస్‌లలో విజయమే లక్ష్యంగా పోరాడతామని పేర్కొన్నాడు.
ఫేవరిట్‌గా టీమిండియా...బలహీనంగా ఆసిస్
2017 నవంబర్ కంటే ముందు టీమిండియా విదేశాల్లో 7 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌లలో ఘన విజయం సాధించింది. గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టీ-20లో ఓటమిని చవిచూసినా ఆ తర్వాత జరిగిన టీ-20 సిరీస్‌ను 3-0తో టీమిండియా గెల్చుకుంది. ఇదే ఊపుతో ప్రస్తుతం ఆసిస్ టూర్‌లో సైతం టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు కోహ్లీ సేన తహతహలాడుతోంది. మరోపక్క ఆస్ట్రేలియా టీమ్ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా టూర్‌లో జరిగిన బాల్‌ట్యాంపరింగ్ వివాదంతో ఇప్పటికీ సతమతమవుతోంది.
జట్టులోని కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్, మరో క్రికెటర్ కామరాన్ బాన్‌క్రాఫ్ట్ ఆటకు దూరమయ్యారు. ఈ ముగ్గురు క్రికెటర్ల ప్రభావం ఈ ఏడాది మార్చి తర్వాత ఆసిస్ వివిధ జట్లతో ఆడిన ఏ టీ-20 సిరీస్‌లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్, ఆ తర్వాత జింబాబ్వేలో పాకిస్తాన్‌తో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లలో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసింది. విదేశీ జట్లతో ఇటీవల కాలంలో ఎదురైన ఓటములను పరిగణనలోకి తీసుకుంటే స్వదేశంలో బలమైన టీమిండియాతో పోరాడాలంటే ఆసిస్ సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు తొలి టీ-20 ప్రారంభమవుతుంది.

చిత్రాలు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్