క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో బీసీసీఐ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 20: ద్వైపాక్షిక సిరీస్ విషయంలో ఒప్పందానికి తిలోదకాలిచ్చిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నుంచి పరిహారం ఇప్పించాలని పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వివాదాల ప్యానల్ మంగళవారం తోసిపుచ్చింది. ఈమేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విన్నపాన్ని నిరాకరించామని ఐసీసీ ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో బీసీసీఐ విజయం సాధించినట్టే. 2015 నుంచి 2023 వరకు ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలన్న ఎంవోయూలను భారత క్రికెట్ బోర్డు గౌరవించలేదని ఆరోపించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తం 447 కోట్ల రూపాయల పరిహారాన్ని బీసీసీఐ నుంచి ఇప్పించాలని డిమాండ్ చేసింది. ఐతే ఐసీసీ సూత్రాల మేరకు భారత్ సూచించిన రెవిన్యూ మోడల్‌కు మద్దతు తెలుపకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అగౌరవంగా వ్యవహరించడం వల్లే పాక్ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిన అగత్యం ఏర్పడలేదని ఐసీసీకి భారత క్రికెట్ బోర్డుకు వివరించింది. ఈ క్రమంలో ఐసీసీ ముగ్గురు సభ్యులతో కూడిన వివాదాల పరిష్కార కమిటీని ఏర్పాటుచేసి పాకిస్తాన్ విజ్ఞప్తిపై విచారణ జరిపించింది. గత అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఇందుకు సంబందించిన హియరింగ్ జరిగింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ కుర్షిద్‌ను కమిటీ ప్రశ్నించింది. భారత్‌కు సంబంధించిన భద్రతా పరమైన సమస్యలను సైతం సల్మాన్ కుర్షిద్ ఐసీసీ కమిటీకి సవివరంగా తెలియజేసి, భారత్ ఎందుకు పాక్‌తో ఒప్పందాన్ని తిరస్కరించాల్సి వచ్చిందో తెలియజేశారు.
లీగల్ ఖర్చులు ఇవ్వండి
పీసీబీపై కౌంటర్ దాఖలుకు బీసీసీఐ నిర్ణయం
కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందున నష్టపరిహారం చెల్లించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చిన నేపథ్యంలో న్యాయపరంగా అయిన ఖర్చుల వసూలుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రంగంలోకి దిగింది. 2015-2023 వరకు భారత్- పాక్ క్రికెట్ జట్ల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కానీ ఉగ్రవాదం, భద్రత కారణాల నేపథ్యంలో ఆడడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పినా తాము ఆర్థికంగా నష్టపోయామంటూ ఇందుకు 447 కోట్ల రూపాయలు పరిహారం భారత్ నుంచి ఇప్పించాలని గత కొంతకాలంగా పీసీబీ డిమాండ్ చేస్తోంది. పాక్ డిమాండ్‌ను గత మూడు రోజులుగా దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ప్యానల్ ఇరువర్గాల వాదనలు తగిన ఆధారాలతో సహా సేకరించింది. తుదకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ ఐసీసీ ప్యానెల్ స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు న్యాయపరంగా రావల్సిన ఖర్చులను చెల్లించాలని బీసీసీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.