క్రీడాభూమి

సెమీస్‌కు నలుగురు భారత బాక్సర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నలుగురు భారత బాక్సర్లు మెరిశారు. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ తన ఖాతాలో 7వ గోల్డ్‌మెడల్ సాధించే దిశగా దూసుకుపోతోంది. 48 కేజీల లైట్ ఫ్లైవెయిట్ కేటగిరిలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా బాక్సర్ ఉయును 5-0 తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో మేరీ కోమ్‌కు కనీసం కాంస్య పతకమైనా తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 69 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో పోటీపడిన మరో బాక్సర్, అసోంకు చెందిన 21 ఏళ్ల లవ్‌లినా బోర్గోహెయిన్ 5-0 తేడాతో ఆస్ట్రేలియా బాక్సర్ స్కాట్ కయె ఫ్రానె్సస్‌ను ఓడించింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా సెమీస్‌లో చోటుదక్కించుకున్న బోర్గోహెయిన్ ఈ ఏడాది జరిగిన ఇండియా ఓపెన్‌లో గోల్డ్‌మెడల్ అందుకుంది. 21 ఏళ్ల సోనియా చాహల్ 57 కేజీల విభాగంలో పోటీపడి కొలంబియా బాక్సర్ మేసెలా యెని కాస్టెనాడాను 4-1 తేడాతో ఓడించింది. అదేవిధంగా 23 ఏళ్ల సిమ్రాన్‌జిత్ కౌర్ 64 కేజీల విభాగంలో ఐర్లాండ్ బాక్సర్ ఆమీ సారా బ్రాడ్‌హర్ట్స్‌పై 3-1 తేడాతో పైచేయి సాధించింది. ఇదిలావుండగా, 35 ఏళ్ల మణిపురికి చెందిన దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ చివరిసారిగా 2010లో 48 కేజీల విభాగంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ అందుకుంది. అప్పటినుంచి మరో గోల్డ్‌మెడల్‌పై కనే్నసిన ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా ప్రత్యర్థితో జరిగిన పోరు అంత కష్టంగానీ, అంత సులభంకానీ కాలేదని పేర్కొంది. తన క్రీడాజీవితంలో ఎంతోమంది చైనా బాక్సర్లను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో దక్షిణకొరియా బాక్సర్ కిమ్ హ్యాంగ్ మితో మేరీ కోమ్ తలపడుతుంది. భారత బాక్సర్ బోర్గోహెయిన్ తన తదుపరి పోరులో గురువారం తైపీ బాక్సర్ చెన్ నైన్‌చిన్‌తో ఢీకొంటుంది. ప్రపంచ టోర్నీలో గోల్డ్‌మెడల్ సాధించడం తన లక్ష్యమని పేర్కొంది. ఇదిలావుండగా, భారత బాక్సర్లు మనీషా వౌన్ (54 కేజీలు), భాగ్యబతి కచారీ (81 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), మనీనా వౌన్ (54 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో నిరాశపరిచారు.
చిత్రాలు.. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో గెలుపుతో భారత బాక్సర్లు మేరీ కోమ్, లవ్‌లినా బోర్గోహెయన్, సోనియా చాహల్ విజయ దరహాసం, ప్రత్యర్థిపై పంచ్ విసురుతున్న సిమ్రాన్‌జిత్ కౌర్