క్రీడాభూమి

గ్రీమీ హిక్‌ను మార్చితేనే మేలు : వార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్‌బేన్, నవంబర్ 21: ఆస్ట్రేలియా క్రికెట్ గత కొంతకాలంగా వివిధ ఫార్మాట్లతో ఆడిన 24 మ్యాచ్‌లలో 18 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసినందున బ్యాటింగ్ కోచ్ గ్రీమీ హిక్‌ను మార్చితే మేలు జరుగుతుందని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఆసిస్ తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20లో పరాజయం పాలైన నేపథ్యంలో 3మార్పునకు టైమొచ్చింది2 అంటూ సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్ పత్రికతో మాట్లాడుతూ అన్నాడు. గత 25-30 ఏళ్లకాలంలో ఆస్రేలియా క్రికెట్‌లో ఎంతోమంది అద్భుత ఆటగాళ్లు మెరిశారని అన్నాడు. ప్రస్తుత జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రీమీ హయాంలో గత కొనే్నళ్లుగా ఆటగాళ్లు చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారని, దీనివల్ల ఓటమిని చవిచూస్తున్నారని, అందువల్లే 3మార్పు అవసరం2 అని పరోక్షంగా గ్రీమీ హిక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఆసిస్‌కు చెందిన మాజీ దిగ్గజాలు ఈ పదవికి సంపూర్ణ న్యాయం చేకూరుస్తారని అంటూ అందుకు మార్క్ వా, రికీ పాంటింగ్, మిచెల్ క్లార్క్, మైక్ హస్సీ వంటివారి పేర్లను ఉదహరించాడు.